‘‘ఆ దేశం మతోన్మాదం, ఉగ్రవాదాని కేంద్రం’’

యూఎన్ లో పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు;

Update: 2025-07-23 11:33 GMT
పర్వతనేని హరీష్

ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్ ను భారత్ తీవ్రంగా విమర్శించింది. పొరుగు దేశం మతతత్వంతో మునిగిపోయిందని, సీరియల్ రుణగ్రహీత అని అభివర్ణించింది.

సరిహద్దు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే దేశాలు తీవ్రమైన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ అధ్యక్షతన జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘అంతర్జాతీయ శాంతిభద్రతలను ప్రొత్సహించడం గురించి మనం చర్చిస్తున్నప్పుడూ, విశ్వవ్యాప్తంగా గౌరవించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని గుర్తించడం చాలా అవసరం. వాటిలో ఒకటి ఉగ్రవాదాన్ని సహించకపోవడం’’ అని ఐరాస లో భారత శాశ్వత ప్రతినిధి రాయబారీ పర్వతనేని హరీష్ అన్నారు.
పాకిస్తాన్ అధ్యక్షతన జూలైలో జరిగిన 15 దేశాల కౌన్సిల్ లో ‘బహుపాక్షికత, వివాదాల శాంతియుత పరిష్కారం ద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రొత్సహించడం’’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో హరీష్ మంగళవారం ఈ ప్రకటన చేశారు.
ఈ చర్చకు పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అధ్యక్షత వహించారు. దీనిలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ప్రసంగించారు.
ఉగ్రవాదపు ఫ్యాక్టరీ
చర్చలో మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ జమ్మూకాశ్మీర్ అంశంతో పాటు, సింధూ జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. దీనిపై భారత్ ఈ విధంగా స్పందించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి విశ్వసనీయంగా, తిరిగి మార్చలేని విధంగా మద్దతు ఇవ్వడం మానుకునే వరకూ 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది.
బహిరంగ చర్చలో తుర్కియె(టర్కీ) కూడా జమ్మూకాశ్మీర్ అంశం గురించి ప్రస్తావించింది. దార్ వ్యాఖ్యలకు బలమైన ప్రతిస్పందనగా ఇస్తూ, భారత ఉపఖండం పురోగతి, శ్రేయస్సు, అభివృద్ది నమూనాల పరంగా పూర్తి విరుద్దంగా ఉందని హరీష్ అన్నారు.
‘‘ఒక వైపు భారత్ ఉంది. ఇక్కడ పరిణతి చెందిన ప్రజాస్వామ్యం ఉంది. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, బహుళత్వం సమ్మిళిత సమాజం. మరోవైపు పాకిస్తాన్, మతతత్వం, ఉగ్రవాదంలో మునిగిపోయింది. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణగ్రహీత’’ అంటూ విరుచుకుపడింది.
తీవ్రమైన ఖర్చు..
ఈ సంవత్సరం మే నెలలో ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు ఎక్స్ టెండెట్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) కింద సుమారు ఒక బిలియన్ డాలర్ చెల్లించడానికి ఆమోదం తెలిపింది.
ఈ మంజూర్ తో దాదాపు 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. యూఎన్ఎస్సీ ఛాంబర్ ఇటీవల అమెరికా నిషేధం విధించిన లష్కరే తోయిబా ముసుగు సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ గురించి కూడా ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ సంబంధాలను ఉల్లంఘించే దేశాలకు తీవ్రమైన పరిహారం ఉండాలని హరీష్ చెప్పారు. ‘‘అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కానీ పద్దతులను అనుసరిస్తూ ధర్మోపదేశాలు చేయడం కౌన్సిల్ సభ్యుడికి తగదు’’ అని భారత రాయబారీ అన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక హిందూ పర్యాటకులు మరణించారు. యూఎన్ఎస్సీ ప్రకటన ఆధారంగా భారత్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించిందని ఆయన అన్నారు.
అమెరికా జోక్యం..
అంతకుముందు తాత్కాలిక అమెరికా ప్రతినిధి రాయబారీ డోరతీ షియా సమావేశంలో మాట్లాడుతూ.. గత మూడు నెలల్లోనే అమెరికా నాయకత్వం కింద ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా భారత్, పాకిస్తాన్ మధ్య ఉపశమనం సాధించిందని అన్నారు.
తీరు మారింది
దశాబ్ధాలలో సంఘర్షణల స్వభావం మారిపోయిందని హరీష్ నొక్కి చెప్పారు. సరిహద్దుల వెలుపల నిధులు, ఆయుధ అక్రమ రవాణా, ఉగ్రవాదులకు శిక్షణ, రాడికల్ భావజాల వ్యాప్తి, ఆధునిక డిజిటల్, కమ్యూనికేషన్ టెక్నాలజీల ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తున్నారని అన్నారు. వివాద పరిష్కారానికి ఒకే ఒక ప్రామాణిక విధానం ఉండదని హరీష్ చెప్పారు.
అటువంటి ప్రయత్నాలను పరిగణలోకి తీసుకునేటప్పుడూ మారుతున్న పరిస్థితులు, సందర్భాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. భద్రతా మండలి ప్రాతినిధ్యంపై తీవ్రమైన ప్రశ్నార్థకాలను తక్షణమే పరిష్కరించాలని హరీష్ అన్నారు.
‘‘ఈ సందర్భంలో భారత్ తన అధ్యక్షత సమయంలో జీ 20 వేదికలో ఆఫ్రికన్ యూనియన్ ను చేర్చడానికి దోహదపడినందుకు గర్వంగా ఉంది. యూఎన్ భద్రతా మండలి ప్రతిష్టంభన యూఎన్ భద్రతా మండలి సామర్థ్యం, ప్రభావానికి పెరుగుతున్న సవాళ్లను కూడా చూపిస్తుంది’’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం 2025-26 కాలానికి 15 దేశాల కౌన్సిల్ లో శాశ్వత సభ్యుడు.


Tags:    

Similar News