‘‘టెక్ కంపెనీలు అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలి’’

ఏఐ సమ్మిట్ లో మాట్లాడిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్;

Update: 2025-07-24 12:06 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ వంటి దేశాలతో సహ విదేశీ నియామకాలను టెక్ కంపెనీలు నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, గూగుల్, మైక్రోసాప్ట్ వంటి ప్రధాన టెక్ కంపెనీలను కోరారు.

వాషింగ్టన్ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఆయన మాట్లాడారు. అమెరికన్ సంస్థలు ఇప్పుడు పనిని ఔట్ సోర్సింగ్ చేయడం లేదా విదేశాలలో కార్యకలాపాలను విస్తరించడం కంటే అమెరికన్ పౌరులకు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారని జాతీయ మీడియా వార్తా కథనాలుప్రసారం చేసింది.

ఆ రోజులు అయిపోయాయి..
టెక్ రంగం అనుసరిస్తున్న ‘గ్లోబలిస్ట్ మనస్తత్వాన్ని’ ట్రంప్ ఆ సందర్భంగా విమర్శించారు. ఈ విధానాలు అమెరికన్ కార్మికుల ఆర్థిక వృద్దికి నిరోధంగా మారిందన్నారు. అమెరికా స్వేచ్చ నుంచి కంపెనీలు లాభపడుతున్నాయని, దేశం వెలుపల భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన ఆరోపించారు.
‘‘మన అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకూ చైనాలో తమ కర్మాగారాలను నిర్మిస్తున్నాయి. భారత్ లోని కార్మికులను నియమించుకుంటూ ఐర్లాండ్ లో లాభాలు కూడబెట్టుకుంటూ అమెరికా స్వేచ్ఛా ఆశీర్వాదాలను పొందుతున్నాయి. అయితే ట్రంప్ హయాంలో ఆ రోజులు ముగిశాయి’’ అని ఆయన అన్నారు.
కార్యనిర్వాహాక ఉత్తర్వూలపై సంతకం
‘‘ఏఐ రేసులో గెలవడం వల్ల సిలికాన్ వ్యాలీలో, సిలికాన్ వ్యాలీకి మించి దేశభక్తి, జాతీయ విధేయత కొత్త స్పూర్తిని కోరుతుంది’’ అని ట్రంప్ అన్నారు. ‘‘అమెరికాకు మద్దతుగా నిలబడే అమెరికా టెక్నాలజీ కంపెనీలు మనక అవసరం. మీరు అమెరికాకు మొదటి స్థానం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు అలా చేయాలి. మేము అడుగుతున్నది అదే’’ అని ఆయన అన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన మూడు కార్యనిర్వాహాక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ఈ ఉత్తర్వులలో ఒకటి అమెరికాలో ఏఐ అభివృద్ది పెంచడానికి, దేశ పురోగతిని మందగించే అడ్డంకులను తొలగించడానికి వ్యూహాన్ని వివరిస్తుంది. ‘‘విన్నింగ్ ది రేస్ ’ అనే శీర్షికతో డేటా సెంటర్ లు, సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్దిని వేగవంతం చేయడం ద్వారా అమెరికాను ఏఐ లో అగ్రగామిగా మార్చడం ఈ ప్రణాళిక లక్ష్యం. ఏఐ కి అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు నిర్మించడాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఓక్ ఏఐ నిషేధం..
రెండవ ఆర్డర్ ఫెడరల్ నుంచి ఏఐ నిధులు పొందుతున్న కంపెనీలకు వర్తిస్తుంది. ఈ సంస్థలు ఇప్పుడు వారి ఏఐ సాధనాలు రాజకీయంగా తటస్థంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ట్రంప్ కొన్ని నమూనాలను తిరస్కరించారు. గత పరిపాలన వలన ఏఐ పురోగతి మందగించిందని ఆయన విమర్శించారు.
రీ బ్రాండింగ్ ఏఐ..
ట్రంప్ కూడా కృత్రిమ మేధస్సు అనే పదాన్ని ఇష్టపడని, సాంకేతికత, శక్తి, తెలివితేటలను బాగా సంగ్రహించే దానిని ఇష్టపడతానని అన్నారు. ‘‘ఇది కృత్రిమమైనది కాదు, మహా మేధావి’’ అని ఆయన చమత్కరించారు. మూడో ఆర్డర్ ప్రపంచ మార్కెట్ లో అమెరికన్ నిర్మిత ఏఐ సాధనాలకు సహాయం చేయడంపై దృష్టి పెడుతోంది.
ఇది యూఎస్ లో ఏఐ పూర్తి స్టాక్ అభివృద్దికి మద్దతు ఇవ్వడం ద్వారా వారి ఎగుమతిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు తక్షణ ప్రభావాన్ని చూపకపోవచ్చు. కానీ ఈ విధానాలు కొనసాగితే భవిష్యత్ లో అవుట్ సోర్సింగ్ కంపెనీలకు నష్టం కలిగించవచ్చు.


Tags:    

Similar News