భారత్ లో అతని ఎజెండా?
ముత్తాఖీ తన పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్ ను కలవనున్నారు. భవిష్యత్ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలు, వాణిజ్యం వంటి వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. భారత్ కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అయితే రెండు వైపులా రహస్యంగా దౌత్యసంబంధాలు మాత్రం నెలల తరబడి కొనసాగుతున్నాయి.
ఇది ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య రెండో సంభాషణ అవుతుంది. కానీ వ్యక్తిగతంగా కలవడం మాత్రం మొదటిసారి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తరువాత మే 15న ఇరువురు నాయకులు ఫోన్లో మాట్లాడారు.
జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీని దుబాయ్ లో ముత్తాఖీని కలిశారు. తాలిబన్ నాయకుడు సెప్టెంబర్ లో భారత్ ను సందర్శించడానికి ప్రయత్నించాడు.
అయితే అతనిపై ఐరాస ఆంక్షలు ఉండటంతో అతని పర్యటన వాయిదా పడింది. తాలిబన్ నాయకులందరిపై ఐరాస భద్రతా మండలి యూఎన్ఎస్సీ ఆంక్షలు విధించింది. తాలిబన్ నాయకులు కచ్చితంగా విదేశాలకు వెళ్లాలంటే యూఎన్ఎస్సీ నుంచి అనుమతి పొందాలి.
‘‘సెప్టెంబర్ 30, 2025న 1988((2011) తీర్మానం ప్రకారం ఏర్పాటు చేసిన భద్రతా మండలి కమిటీ 2025 అక్టోబర్ 9, నుంచి 16 వరకూ భారత్ లోని న్యూఢిల్లీని సందర్శించడానికి అమీర్ ఖాన్ మోటాకీ ప్రయాణ నిషేధానికి మినహయింపు ఆమోదించింది’’ అని యూఎన్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు..
తాలిబన్లు మొదటిసారిగా అధికారంలోకి వచ్చాక న్యూఢిల్లీకి వ్యతిరేకంగా వ్యహరించారు. కాబూల్ లో వారు చేపట్టిన హింసాత్మక చర్యలు, మానవ హక్కుల సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ దానికి దూరంగానే వ్యవహరించింది.
తాలిబన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి భారత్ ఆఫ్గన్లకు మానవతా సాయం అందించడం ద్వారా సహాయం చేస్తోంది. ఇది గోధుమలు, మందులు, పురుగు మందులు, కోవిడ్ వ్యాక్సిన్లు, మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటానికి సాయం చేస్తోంది. అలాగే కార్యక్రమాల కోసం పరిశుభ్రత కిట్ లు, శీతాకాలపు దుస్తులు, స్టేషనరీ కిట్ లను సైతం అందిస్తోంది.
జనవరిలో జరిగిన సమావేశంలో క్రికెట్ సహకారాన్ని బలోపేతం చేయడానికి జనవరి సమావేశంలో వాణిజ్య, వాణిజ్య కార్యకలాపాలకు మద్దతుగా ఇరాన్ లోని చాబహార్ ఓడరేవును ఉపయోగించుకుని తన వాణిజ్య కార్యకలాపాలను కోసం చర్చలు జరిగాయి.
చారిత్రకంగా భారత్ తాలిబన్లకు వ్యతిరేకం వైఖరినే తీసుకుంది. అంతర్యుద్దం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 1990 లో ఆఫ్ఘనిస్తాన్ లో తన కాన్సులేట్ లను మూసివేసింది. యుద్ధం ముగిసిన తరువాత 2002 లో తిరిగి వాటిని తెరిచింది.