‘‘పోప్ ఫ్రాన్సిస్ ప్రజల పోప్ గా కీర్తి గడించాడు‘‘
వీడ్కోలు సందేశం ఇచ్చిన కార్డినల్ రే, తుది వీడ్కోలుకు హాజరయిన ప్రపంచ నాయకులు;
Translated by : Praveen Chepyala
Update: 2025-04-26 13:41 GMT
క్యాథలిక్ అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ ను వీడ్కోలు పలికేందుకు ప్రపంచ నాయకులు, ప్రముఖులు, కాథలిక్ మత గురువులు వాటికన్ చేరుకుని శ్రద్దాంజలి ఘటించారు.
సెయింట్ పీటర్ స్వ్కేర్ దగ్గరకి పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు రెండు లక్షల మంది హాజరయ్యారు. మొట్టమొదటి లాటిన్ అమెరికన్ పోప్ అయిన ఫ్రాన్సిస్, ఏప్రిల్ 21, 2025న 88 సంవత్సరాల వయస్సులో గుండె పోటుతో మరణించారు.
ఆయన అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ప్రిన్స్ విలియం, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయల్ మాక్రాన్ లాంటి ప్రపంచ అతిరథులు హజరయ్యారు.
అంత్యక్రియలు లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి..
ఇటీవల సంప్రదాయానికి భిన్నంగా ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ బసిలికా కిందన ఖననం చేయరు. కానీ సెయింట్ మేరీ మేజర్ బసిలికాలో ఖననం చేస్తారు. పోప్ ఫ్రాన్సిస్ కోసం ఒక సాధారణ భూగర్భ సమాధిని నిర్మించారు.
ఇక్కడికి ఖైదీలు, వలసదారులు, బసిలికాలోకి స్వాగతిస్తారు. అక్కడ ఆయన అంత్యక్రియలు జరగుతాయి. ఇది పోప్ ఫ్రాన్సిస్ 12 సంవత్సరాల ప్రాజెక్ట్ అయిన పాపసీని సమూలంగా సంస్కరించడానికి దాని పాస్టర్లను సేవకులుగా నొక్కి చెప్పడానికి పేదల కోసం పేద చర్చిని నిర్మించే ప్రయత్నం చేశారు.
ఫ్రాన్సిస్ గత సంవత్సరం తన అంత్యక్రియల ఆచారాలను స్వయంగా నృత్య రూపకల్పన చేశాడు. పోప్ ను ఈ ప్రపంచంలోనే అత్య శక్తివంతమైన వ్యక్తిగా కాకుండా వినయపూర్వకమైన పాస్టర్ గా చిత్రీకరించడానికి వాటికన్ సంప్రదాయాలను సవరించాడు.
ప్రజల పోప్
అంత్యక్రియల కార్యక్రమం వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్క్వేర్ లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పదిగంటలకు ప్రారంభమైంది. తరువాత ఆయనను రోమ్ లోని బసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ లో ఖననం చేస్తారు.
ఈ సేవకు నాయకత్వం వహించిన కార్డినల్ గియోవన్నీ బాటిస్టా రే, ఫ్రాన్సిస్ ను ప్రజల పోప్ గా అభివర్ణించారు. పోప్ అందరి పట్ల ఆప్యాయత, సరళత, విశాల హృదయాన్ని ప్రదర్శించారని చెప్పారు.
వలసదారులు, శరణార్థులకు ఫ్రాన్సిస్ అంచచలమైన మద్దతును ప్రకటించారని గుర్తు చేశారు. మధ్యధరా సముద్రంలోని ఇటాలియన్ ద్వీపమైన లాంపెండుసాకు తన చారిత్రాత్మక మొదటి పాపల్ సందర్శనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది ఉత్తర ఆఫ్రికా నుంచి ప్రజలు దాటే మొదటి నౌకాశ్రయం.
నాయకుల గౌరవం..
ఈ కార్యక్రమానికి అనేక మంది దేశాధినేతలు హాజరయ్యారు. గతంలో ఫ్రాన్సిస్ తో ఘర్షణ పడిన అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. దివంగత పోప్ ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తి అని ప్రశంసించారు.
భారత్ తరఫున అధ్యక్షుడు ముర్ముతో పాటు అంత్యక్రియలకు హాజరైన కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ .. ఫ్రాన్సిస్ అన్ని జాతులు, మతాలను గౌరవించే మానవజాతి నాయకుడు అని ప్రశంసించారు.
యుద్దాలను ఆపడానికి ఆయన తరుచుగా పిలుపునిచ్చేవారని,పేదల పట్ల కరుణ, దయతో ఉండాలని చెప్పేవారని కార్డినల్ రే అన్నారు.
#WATCH | Vatican City | President Droupadi Murmu, along with other world leaders, attends the state funeral of His Holiness Pope Francis, who passed away on April 21.
— ANI (@ANI) April 26, 2025
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/3ECVRfRL8H
చివరి జ్ఞాపకం..
ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీ నుంచి భారీ జనసమూహాన్ని ఆశీర్వదించడం ఈస్టర్ ఆదివారం నాడు ఆయన కనిపించడం చాలామందికి ఫ్రాన్సిస్ చివరి చిత్రం. కార్డినల్ రే ప్రసంగం ముగించినప్పుడు ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ తన ప్రసంగాలను ప్రార్థనలు అడగటం ద్వారా ముగించేవాడని దు:ఖితులకు గుర్తు చేశారు.
‘‘ప్రియమైన పోప్ ఫ్రాన్సిస్ ఇప్పుడు మేము మిమ్మల్ని మా కోసం ప్రార్థించమని అడుగుతున్నాము. ఈ బాసిలికా బాల్కనీ నుంచి గత ఆదివారం చేసినట్లుగా మీరు చర్చిని, రోమ్ ను, మొత్తం ప్రపంచాన్ని ఆశీర్వదించండి’’ అని రీ ముగించారు.