ఇజ్రాయెల్ కు ఏఐ టెక్నాలజీ ఇవ్వడంపై మైక్రోసాప్ట్ ఉద్యోగిని అభ్యంతరం

కంపెనీ వార్షికోత్సవంలో రభస సృష్టించిన ఇద్దరు ఉద్యోగినులు;

Update: 2025-04-08 11:31 GMT

వాషింగ్టన్ లో జరిగిన మైక్రోసాప్ట్ 50 వ వార్షికోత్సవ కార్యక్రమం గందరగోళంగా మారింది. కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు వానియా అగర్వాల్, ఇబ్తిహాల్ అబౌసాద్ ఇజ్రాయెల్ కంపెనీకి ఏఐ టెక్నాలజీతో సంబంధాలు ఉండటంపై బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

మైక్రోసాప్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో ఈ రభస జరిగింది. అబౌసాద్ ప్రేక్షకుల మధ్య లేచి నిలబడి సులేమాన్ ను ‘‘యుద్ధాలతో లాభం పొందేవాడు’’ అని గట్టిగా నినాదాలు చేశారు. ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మైక్రోసాప్ట్ టెక్నాలజీలను జాతి విధ్వంస చర్యలకు ఉపయోగిస్తున్నారని అబౌసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మైక్రోసాప్ట్ ఏఐ టెక్నాలజీ ద్వారా గాజాలో మారణ హోమాన్ని ప్రారంభిస్తోందని ఆమె ప్రకటించారు. ‘‘ మీ నిరసనకు ధన్యవాదాలు, నేను మాట విన్నాను’’ అని సులేమాన్ ప్రతిస్పందించాడు. ఆ తరువాత అబౌసాద్ ను వేదిక నుంచి బయటకు తీసుకెళ్లారు.
సాహసోపేతమైన ఘర్షణ..
బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ సత్య నాదెళ్లతో కూడిన ప్యానెల్ సమయంలో భారతీయ- అమెరికన్ ఇంజనీర్ వానియా అగర్వాల్ లేచి నిలబడి వారిని ఎదుర్కొన్నప్పుడూ మరింత నాటకీయ క్షణం వచ్చింది.
మైక్రోసాప్ట్ టెక్నాలజీతో గాజాలో 50 వేల మంది పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారు. వారి రక్తంపై సంబరాలు చేసుకుంటున్నదుకు మీరందరూ సిగ్గుపడాలి. ఆ తరువాత ఆమెను సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. కానీ ఈ ఫుటేజ్ మాత్రం బాగా వైరల్ అయింది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖతో మైక్రోసాప్ట్ కుదుర్చుకున్న 133 మిలియన్ డాలర్ల క్లౌడ్, ఏఐ ఒప్పందాన్ని అగర్వాల్ విమర్శించారు. గాజాలో మారణహోమాన్ని ప్రొత్సహించడంలో ఆ కంపెనీ భాగస్వామి అని ఆరోపించారు.
వెంటనే అగర్వాల్ ఏప్రిల్ 11 నుంచి అమలులోకి వచ్చేలా తన రాజీనామా ప్రకటిస్తూ అన్ని మైక్రోసాప్ట్ ఉద్యోగులకు రాజీనామా పంపారు. సైనిక దురాక్రమణ, హింసాత్మక అన్యాయంతో ఉన్న సాంకేతిక శక్తుల కంపెనీలో తాన మనస్సాక్షితో ఉండలేనని ఆమె తన సందేశంలో పేర్కొంది.
ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలకు, నిఘాకు మద్దతు ఇవ్వడానికి మైక్రోసాప్ట్ అజూర్, ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్న నివేదికలను ఆమె ఉదహరించారు. మా శ్రమ ఈ మారణ హోమానికి ఆజ్యం పోస్తుందని పేర్కొంది. కంపెనీని జవాబుదారీగా ఉంచడానికి తన సహోద్యోగులు వారి హోదాలను ఉపయోగించాలని కోరింది.
మౌనం వహించిన మైక్రోసాప్ట్..
మైక్రోసాప్ట్ అంతర్గతంగా వారి వాయిస్ వినిపించేందుకు తగిన అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ రాజీనామాలు, ఆరోపణలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. నిరసనలు మొదలైన వెంటనే అగర్వాల్, అబౌసాద్ ఇద్దరు తమ కార్యాలయాల ఎంట్రీ అర్హత కోల్పోయినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ సంఘర్షణలలో కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంపై సిలికాన్ వ్యాలీలో పెరుగుతున్న అసమ్మతిని ఈ ఎదురుదెబ్బ బయటి ప్రపంచానికి తెలిపింది.
పాలస్తీనా వివాదం..
అక్టోబర్ 2023 న ఇజ్రాయెల్ పై హమాస్ కిరాతకంగా దాడి చేసింది. అమాయకులైన 12 వందల మంది యూదు పౌరులను హత్య చేసింది. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. దీనికి ప్రతిగా ఐడీఎఫ్ బలగాలు హమాస్, హెజ్ బుల్లా పై దాడులకు దిగింది.
ఈ దాడుల్లో హమాస్ ఉగ్రవాదులతో పాటు వేలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. దాదాపు 2.3 మిలియన్ల మంది ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వేరే ప్రదేశాలకు పారిపోవాల్సి వచ్చింది.
ఈ యుద్దంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ మైక్రోసాప్ట్ ఏఐ, క్లౌడ్ సేవలను ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులు సూచిస్తున్నాయి. ఇది ఉద్యోగులు,మానవ హక్కుల కార్యకర్తలలో ఆందోళనలను రేకెత్తిస్తోంది.
అయితే కొద్ది రోజులగా హమాస్ కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు సైతం ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఆందోళకారులపై హమాస్ విరుచుకుపడుతోంది. తాజాగా ఓ 23 ఏళ్ల యువకుడిని బంధించి, నానావిధాలుగా చిత్రవధ చేసి హత్య చేసి, బాడీని వీధుల్లో పడవేశారు.


Tags:    

Similar News