క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి
14 మంది మృతి, 35 మందికి తీవ్ర గాయాలు;
పాకిస్తాన్ లోని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) నిర్వహించిన బహిరంగ ర్యాలీ సందర్భంగా భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 14 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సర్ధార్ అత్తౌల్లా మెంగల్ నాల్గవ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీ ముగిసిన తరువాత మంగళవారం రాత్రి సరియాబ్ ప్రాంతంలో షావానీ స్టేడియం సమీపంలో పేలుడు సంభవించిందని ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక కథనం ప్రసారం చేసింది.
ప్రజలు మరణించారని ప్రావిన్షియల్ ఆరోగ్యమంత్రి బఖ్త్ ముహ్మద్ కాకర్ ధృవీకరించారు. ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు నిర్ధారించారని డాన్ పత్రిక కూడా నివేదించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమావేశం ముగిసిన 15 నిమిషాల తరువాత పేలుడు సంభవించింది. సమావేశంలో పాల్గొన్నవారు బయటకు వెళ్తుండగా పార్కింగ్ ప్రాంతంలో బాంబుదాడి చేసిన వ్యక్తి తన పేలుడు పదార్థాలు నిండిన జాకెట్ ను పేల్చుకున్నాడని తెలుస్తోంది.
డాన్ పత్రిక ప్రకారం.. సమావేశానికి అధ్యక్షత వహించిన బీఎన్పీ చీఫ్ అక్తర్ మెంగల్ ఇంటికి బయలుదేరినప్పుడు పేలుడు సంభవించింది. అయితే అతను గాయపడలేదు. ఇందులో ఫఖ్తున్వ్కా మిల్లీ అవామీ పార్టీ చీఫ్ మెహమూద్ ఖాన్ అచక్జాయ్, అవామీ నేషనల్ పార్టీకి చెందిన అస్గర్ ఖాన్ అచక్జాయ్, నేషనల్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ మీర్ కబీర్ ముహ్మద్ షాయ్ కూడా ర్యాలీలో పేర్కొన్నారు. అయితే వీరు కూడా దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.