‘‘కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండకూడదు’’
లండన్ లో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఎలాన్ మస్క్, పాలకులు మారాల్సిందే అని డిమాండ్;
By : Praveen Chepyala
Update: 2025-09-14 10:54 GMT
లండన్ లో వలసదారులు, ఇస్లామిక్ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించిన సంఘటనలో బిలియనీర్ ఎలాన్ మస్క్ వర్చువల్ గా ప్రసంగించారు. యూకే పతనం అంచున ఉందని హెచ్చరించిన ఆయన పాలకులను మార్చాల్సిన(రెజీమ్ ఛేంజ్) అవసరం ఉందని అన్నారు. నిరసనకారులకు రెండు ఛాయిస్ మాత్రమే ఉన్నాయి. ‘‘తిరిగి పోరాడండి లేదా చనిపోండి’’ హింస ఆసన్నమైందని హెచ్చరించారు.
‘‘యునైట్ ది కింగ్ డమ్’’ ర్యాలీలో లక్ష మందికి పైగా హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి మస్క్ మాట్లాడుతూ.. ‘‘భారీ అనింత్రియ వలసలు’’ అని తాను అభివర్ణించిన దాని వల్ల బ్రిటన్ పూర్తి విధ్వంసం ఎదుర్కొంటోందని అన్నారు.
‘‘బ్రిటిషు వ్యక్తిగా ఉండటంలో ఏదో అందమైన విషయం ఉంది. ఇక్కడ జరుగుతున్నది బ్రిటన్ నాశనం’’ అని మస్క్ సమావేశంలో అన్నారు. ‘‘ఇది నెమ్మదిగా కోతతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు అది వేగంగా పెరుగుతోంది’’.
పౌరులకు ‘‘రెండు ఆప్షనల్స్ మాత్రమే ఉన్నాయి. తిరిగి పోరాడటం లేదా చనిపోవడం’’ అని మస్క్ చెబుతూ రాబోయే అశాంతి గురించి మస్క్ హెచ్చరించాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ బ్రిటన్ వేచి ఉండలేదని చెబుతూ, కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని తొలగించాలని ఆయన నేరుగా డిమాండ్ చేశారు.
‘‘బ్రిటన్ లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను నిజంగా అనుకుంటున్నాను. మీరు అలా చేయలేరు. మనకు మరో నాలుగు సంవత్సరాల సమయం లేదు. తదుపరి ఎన్నికలు జరిగడానికి చాలా ఎక్కువ సమయం ఉంది. ఏదో ఒకటి చేయాలి. పార్లమెంట్ రద్దు చేసి, కొత్తగా ఎన్నికలు పెట్టాలి’’ అని ఆయన అన్నారు.
ఇటీవల అమెరికా సంప్రదాయవాదీ చార్లీకిర్క్ హత్యను కూడా మస్క్ ప్రస్తావించారు. హింస పెరగడానికి రాజకీయ పక్షాలను నిందించారు. ‘‘లెప్ట్ వైపు చాలా హింస ఉంది. ఈ వారం మన స్నేహితుడు చార్లీ కిర్క్ ను నిష్కారణంగా హత్య చేశారు. ఆ ప్రజలు దీనిని పండగగా జరుపుకుంటున్నారు. ’’ అని మస్క్ ఆరోపించారు.