లండన్ ర్యాలీలో వైరల్ అయిన భారతీయ చిరు తిండి
ఉల్లిపాయ భాజీ తింటూ కనిపించిన ఇంగ్లీష్ ప్రజలు;
By : Praveen Chepyala
Update: 2025-09-15 05:44 GMT
లండన్ లో వలస వ్యతిరేక నిరసనలు భారీ స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో రైట్ వింగ్ ప్రజలు నగర వీధుల్లో నినాదాలు చేస్తూ కనిపించారు. ఇదే సమయంలో వీధి పక్కన ఉన్న ఒక స్టాల్ లో ప్రసిద్ధ భారతీయ చిరుతిండి ‘ఉల్లిపాయ భాజీ’ని నిరసనకారులు కొనుగోలు చేస్తూ కనిపించారు. దీనిని ఎవరో ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశారు.
‘‘యునైట్ ద కింగ్ డమ్’ అనే శీర్షికతో జరిగిన ర్యాలీలో భారతీయ తిరు తిండి ఇండియన్ స్నాక్ ను కొనుగోలు చేస్తున్న వీడియో వైరల్ అయింది. బ్రిటిష్ జెండాను పట్టుకుని ‘‘మా దేశం మాకు కావాలి’’ అని నినాదాలు చేసిన నిరసనకారులు, భారతీయ స్నాక్ కౌంటర్లలో కూడా చొరబడి భారతీయ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారు.
ఇది కపట నాటకమా? లేదా అందరిని కలుపుకుని వెళ్లడమా అని సోషల్ మీడియాలో చాలామంది ప్రశ్నించారు. ఈ వీడియోకు 9.4 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ క్షణాన్ని వ్యంగ్యంగా భావించారు. ఒక వినియోగదారుడు ‘‘భారతీయులకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ముందు నేను కొన్ని భారతీయ స్నాక్స్ లు తింటాను’’ హాస్యాస్పదంగా అన్నారు.
మరికొందరు దీనిని సాంస్కృతిక బహిరంగతకు చిహ్నంగా వ్యాఖ్యానించారు. ‘‘ఇతర సంస్కృతులను స్వీకరించడంలో తప్పులేదు’’ అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.
కీలక పదం.. చట్ట విరుద్ధం..
మరొక వినియోగదారుడు ఇతరులు అర్ధం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీ అక్రమ వలసదారులు గురించి, సాధారణ వలసదారులు గురించి కాదు. ‘‘స్పష్టంగా వ్యాపారాలు నడుపుతున్న వారు ఇక్కడ చట్టబద్దంగానే ఉన్నారు. ప్రధాన సమస్య చట్టవిరుద్దం’’ అని వినియోగదారు అన్నారు చాలా మంది ఇదే భావనను ప్రతిధ్వనిస్తున్నాయి. నిరసన సాంస్కృతిక వైవిధ్యాన్ని తిరస్కరించడం కాదు. అక్రమ వలసలను లక్ష్యంగా చేసుకున్నదని నొక్కి చెబుతున్నాయి.
ర్యాలీ హింసాత్మకం..
వలసలకు వ్యతిరేకంగా నిరసనగా ‘‘యునైట్ ది కింగ్ డమ్’’ ర్యాలీ లండన్ లో జరిగింది. పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరయ్యారు. వైట్ హాల్ లో స్టాండ్స్ అప్ టూ రేసిజం అంటూ మరో ర్యాలీ కూడా ఇక్కడ జరిగింది.
ఇందులో 5 వేల మంది నిరసనకారులు పాల్గొన్నారు. పోలీసులు వీరిని చెదరగొట్టే ప్రయత్నించడంతో హింసాత్మకంగా మారింది. పోలీసులపై పిడి గుద్దులు గుద్దారు. నివేదికల ప్రకారం.. ఈ అల్లర్లలో పాల్గొన్న వ్యక్తులు రాబోయే రోజులు, వారాలలో కఠినమైన పోలీసు చర్యను ఎదుర్కవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.