బోయింగ్ పై అమెరికాలో దావా వేసిన భారతీయుడు

భారత కోర్టులో విచారణ ఆలస్యం అవుతుందని యూఎస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించిన బాధితులు;

Update: 2025-08-13 11:38 GMT

అహ్మాదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా(ఏఐ-171) విమాన ప్రమాదంలో బాధితుల్లో ఒకరి కుమారుడు, యూఎస్ ఫెడరల్ కోర్టులో బోయింగ్ పై దావా వేశాడు. ఇండియాలో కోర్టులో ఏళ్ల తరబడి విచారణ జరగుతుందని భావించి అమెరికా కోర్టులో ఈ కేసు దాఖలు చేసినట్లు తెలిసింది.

ఏఐ-171 విమాన ప్రమాదంలో తన తల్లి కల్పనా బెన్ ప్రజాపతిని కోల్పోయిన హిర్ ప్రజాపతి, తీర్పు త్వరగా వెలువడేలా అమెరికాలో ఈ కేసు దాఖలు చేసి పోరాడుతున్నానని చెప్పారని ఏఎన్ఐ వార్తా కథనాలు ప్రసారం చేసింది.
65 మంది బాధిత కుటుంబాలు..
‘‘మేము మైక్ ఆండ్రూస్( న్యాయవాదీ) ని నియమించుకున్నాము. బ్లాక్ బాక్స్ నుంచి వెలికి తీసిన సమాచారం వీలైనంత త్వరగా మా ముందుకు వస్తాయని మేము ఆశిస్తున్నాము.
తద్వారా తదుపరి చర్యలకు సంబంధించి మా న్యాయవాదీతో పాటు తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చు. భారత్ లో విచారణలు సంవత్సరాల పాటు జరుగుతాయి. న్యాయం త్వరగా వెలువడాలని మేము యూఎస్ లో కేసు వేసి పోరాడుతున్నాము’’ అని ఆయన తెలిపారు.
న్యాయవాదీ ఆండ్రూస్ 65 మంది బాధితుల కుటుంబాల తరఫున వాదిస్తున్నారు. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం 242 మందితో ప్రయాణిస్తోంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే అది మెడికల్ హస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. నేలపై ఉన్న పంతోమ్మది మంది కూడా మరణించారు.
‘‘ఈ విషాదం జరిగి నేటికి రెండు నెలల అవుతోంది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా కష్టమైన రోజు. కుటుంబాలు మృతుల జ్ఞాపకార్థం కొవ్వొత్తి వెలుగులో జాగరణ నిర్వహించారు. విధ్వంసం గురించి ఆలోచించడానికి మాటలు లేవు. కుటుంబాలు ఇప్పుడు సమాధానాల కోసం వెతుకుతున్నాయి’’ అని ఆండ్రూస్ వార్తా సంస్థతో అన్నారు.
భారత ప్రభుత్వ సహయానికి..
విషాద సమయంలో తన కుటుంబానికి సహాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు న్యాయం జరగుతుందని హిర్ అన్నారు.
‘‘మాకు న్యాయం జరగుతుందని మేము నమ్ముతున్నాము. సంఘటన జరిగినప్పుడూ ప్రభుత్వం మాకు చాలా సహాయం చేసింది. పోలీసులు కూడా మాకు సహాయం చేశారు.
త్వరిత డీఎన్ఏ పరీక్ష తరువాత మృతదేహాలను మాకు అప్పగించిన వైద్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని ఆయన అన్నారు. తన తల్లి కోసం విమాన బుకింగ్ వివరాలను పంచుకుంటూ తాను మొదట జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు టికెట్ బుక్ చేశానని తరువాత ఆమె అభ్యర్థన మేరకు మరో తేదీకి మార్చానని హిర్ చెప్పాడు.
‘‘నా తల్లి కల్పన బెన్ ప్రజాపతి ప్రమాదంలో మరణించాడు. నేను మొదట ఆమె కోసం జూన్ 9 విమానాన్ని బుక్ చేసుకున్నాను. కానీ ఆమె ఉపవాసం ఉండి ఆరోజు ప్రయాణించలేనని ఆమె నాకు చెప్పింది. కాబట్టి నేను దానిని జూన్ 11కీ రీ షెడ్యూల్ చేశాను.
కానీ ఆమె తనకు వేరే తేదీలో ప్రయాణించడం ఇష్టం లేదని చెప్పింది. కాబట్టి నేను చివరకు జూన్ 12కి టికెట్ బుక్ చేసుకున్నాను’’ అని హిర్ చెప్పినట్లు నివేదికలో ఉటంకించబడింది.


Tags:    

Similar News