హెచ్ వన్ బీ వీసా దారులు అమెరికా విడిచి వెళ్లొద్దు

హెచ్ వన్ బీ వీసాలు దుర్వినియోగం చేస్తున్నారన్న ట్రంప్

Update: 2025-09-20 10:26 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బీ వీసాదారులు, హెచ్-4 వీసాలపై 995 డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచడంతో కంపెనీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి.

వీసా ఆంక్షల దృష్ట్యా హెచ్ వన్ బీ, హెచ్ -4 ఉన్న వీసాదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న వీసాదారులు తక్షణమే అమెరికాకు రావాలని టెక్ దిగ్గజాలు కోరాయి.

‘‘హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు గడువుకు ముందే రేపు అమెరికాకు తిరిగి రావాలని మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము’’ అని మైక్రోసాప్ట్ తన ఈమెయిల్ లో కోరింది.
అమెరికాను వదలొద్దు: జేపీ మోర్గాన్..
వీసా పరిమితులపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ హెచ్-1బీ వీసాదారులు అమెరికాలోనే ఉండాలని, అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని జేపీ మోర్గాన్ బయటి ఇమ్మిగ్రేషన్ న్యాయవాదీ సూచించారని నివేదిక పేర్కొంది.
సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చి 12 నెలల పాటు అమలులో ఉండే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుమును విధిస్తూ ట్రంప్ ప్రకటించిన ఒక రోజు తరువాత ఈ పరిణామం జరిగింది.
హెచ్-1బీ వీసా దుర్వినియోగం..
అత్యధిక నైపుణ్యం ఉన్న కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన అమెరికాకు తీసుకువచ్చి విధులు నిర్వహించడానికి హెచ్ వన్ బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా విధానాన్ని వాషింగ్టన్ తీసుకువచ్చింది.
అమెరికన్ కార్మికుల సాయంతో తక్కువ జీతం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించడానికి దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
‘‘హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రేట్ వీసా కార్యక్రమం తాత్కాలిక కార్మికులను అమెరికాకు తీసుకువచ్చి, అధిక నైపుణ్యం కలిగిన విధులను నిర్వహించడానికి రూపొందించబడింది.
కానీ దీనిని ఉద్దేశపూర్వకంగా తక్కువ జీతం, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో అమెరికన్ కార్మికులను భర్తీ చేయడానికి బదులుగా వారి స్థానంలో ఉపయోగించుకుంటున్నారు’’ అని ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హెచ్ -1బీ వీసా కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేయడం జాతీయ భద్రతా ముప్పు అని ట్రంప్ అన్నారు. ‘‘హెచ్-1బీ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేయడం కూడా జాతీయ భద్రతా ముప్పు.
వీసా మోసం, డబ్బును అక్రమంగా తరలించడానికి చేసే కుట్ర. విదేశీ కార్మికులను అమెరికాకు వచ్చేలా ప్రొత్సహించడానికి ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు దేశీయ చట్ట అమలు సంస్థలు హెచ్-1బీ ఆధారిత అవుట్ సోర్సింగ్ కంపెనీలను గుర్తించి దర్యాప్తు చేశాయి’’ అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ చర్యను..
హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగాన్ని నివారించడానికి, ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలనుకునే కంపెనీలపై అధిక ఖర్చులు విధించాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో కంపెనీలు అత్యుత్తమ తాత్కాలిక విదేశీ కార్మికులను నియమించడానికి అనుమతిస్తున్నాయని ట్రంప్ అన్నారు.
‘‘ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున దుర్వినియోగం మన ఆర్థిక, జాతీయ భద్రతపై కలిగించిన తీవ్రమైన హానీ తక్షణ ప్రతిస్పందనను కోరుతోంది. అందువల్ల కొంతమంది విదేశీ కార్మికుల యునైటెడ్ స్టేట్స్ లోకి అనియంత్రిత ప్రవేశం స్టేట్స్ ప్రయోజనాలకు హనికరం అని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే అలాంటి ప్రవేశం అమెరికన్ కార్మికులకు హనీ కలిగిస్తుంది. వారి వేతనాలను తగ్గించడం ద్వారా వారి ఆర్థిక శక్తిని తగ్గింపజేస్తోంది. అందుకే తన ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ ఆయన నిర్ణయాలను సమర్థించుకున్నారు.


Tags:    

Similar News