నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి
మరి కాసేపట్లో అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం;
Update: 2025-09-12 14:49 GMT
నేపాల్ (Nepal) తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు(Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి(Chief Justice Sushila Karki) ఎంపికయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలు, జనరల్ జెడ్ నిరసన ఉద్యమ ప్రతినిధుల మధ్య చర్చల అనంతరం ఆమె ఎంపిక జరిగింది. నేపాల్‌లోని అధ్యక్ష భవనం శీతల్ నివాస్‌లో ఈ రోజు (సెప్టెంబర్ 12) రాత్రి 9 గంటలకు 73 ఏళ్ల సుశీలా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ ప్రధానిగా పనిచేసిన మొదటి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోనున్నారు. నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు ఇప్పటికే ఆమె పేరున ఉంది. జూలై 2016 నుంచి జూన్ 2017 వరకు సేవలందించారు. జనవరి 2009లో మొదటగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.