డాలర్ ఆధిపత్యం తగ్గించడానికి బ్రిక్స్: ట్రంప్

ఈ కూటమి దేశాలపై అదనంగా పదిశాతం టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు;

Update: 2025-07-09 12:03 GMT
డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం బ్రిక్స్ కూటమిపై నిప్పులు చెరిగారు. అమెరికాను దెబ్బతీయడానికి, డాలర్ విలువను క్షీణించడానికి ఆ కూటమి స్థాపించారని, భారత్ తో సహ వేరే సభ్యదేశాలు ఇందులో కొనసాగితే 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

డాలర్ విలువ తగ్గించడానికే బ్రిక్స్..
‘‘బ్రిక్స్ లో ఉండేవారేవరైనా పది శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రిక్స్ మమ్మల్ని బాధపెట్టడానికి, డాలర్ విలువ దిగజార్చడానికి స్థాపించారు.
డాలర్ ప్రపంచ రాజు.. మనం దానిని అలాగే ఉంచాలి. ప్రజలు దానిని సవాల్ చేయాలనుకుంటే, చేయగలరు. కానీ వారు దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
వారిలో(బ్రిక్స్ సభ్య దేశాలు) ఎవరూ ఆ ధర చెల్లించడానికి సిద్దంగా లేరు’’ అని వైట్ హౌజ్ లో జరిగిన ఆరవ క్యాబినెట్ సమావేశం తరువాత విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.
బ్రిక్స్ సభ్యులకు పదిశాతం చార్జీ..
‘‘వారు ఆ ఆట ఆడాలనుకుంటే పర్వాలేదు. కానీ నేను కూడా ఆ ఆట నేను ఆడగలను. కాబట్టి బ్రిక్స్ లో ఉన్న ఎవరికైనా పది శాతం చార్జ్ లభిస్తుంది.’’ అని ట్రంప్ అన్నారు.
ఇది త్వరలో జరుగుతుందని హెచ్చరించారు. ‘‘సరే వారు బ్రిక్స్ సభ్యులైతే వారు పదిశాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయానికి మాత్రమే’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు.
బ్రిక్స్ లోని చాలా వరకూ విడిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. కానీ కొన్ని జంటలు మాత్రం ఇంకా తిరుగుతున్నాయని అన్నారు.
డాలర్ ఆధిపత్యం..
బ్రిక్స్ ను తాను తీవ్రమైన ముప్పు పరిగణించనప్పటికీ, డాలర్ ను మరొక కరెన్సీతో ప్రమాణంగా మార్చాలని చూస్తుందని, అలా జరగనివ్వబోనని ట్రంప్ అన్నారు.
‘‘నా అభిప్రాయం ప్రకారం.. బ్రిక్స్ తీవ్రమైన ముప్పు కాదు. కానీ వారు చేయడానికి ప్రయత్నిస్తుంది డాలర్ ను నాశనం చేయడం. తద్వారా మరొక దేశం దానిని స్వాధీనం చేసుకుని ప్రమాణంగా ఉంటుంది. మేము ఎప్పుడూ ప్రమాణాన్ని కోల్పోము’’ అని ఆయన అన్నారు.
‘‘మీకు తెలివైన అధ్యక్షుడు ఉంటే.. మీరు ఎప్పటికీ ప్రమాణాన్ని కోల్పోరు. మనం ప్రపంచ ప్రామాణిక డాలర్ ను కోల్పోతే.. అది ఒక యుద్ధం, ఒక ప్రపంచ యుద్ధాన్ని కోల్పోయినట్లే. మనం ఇకపై అదే దేశంగా ఉండము. మేము అలా జరగనివ్వము. డాలర్ రాజు.. మేము దానిని అలాగే ఉండనిస్తాము’’ అని ఆయన అన్నారు.
అతి పెద్ద మూల్యం..
బ్రిక్స్ దేశాలు డాలర్ ను సవాల్ చేయాలనుకుంటే దానికి వారు అతిపెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే దానికి వారు సిద్దంగా లేరని కూడా చెప్పారు.
బ్రిక్స్ కూటమిలో మొదట భారత్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ ఉన్నాయి. వీటిలోకి కొత్తగా ఇరాన్, ఇండోనేషియా, ఇథియోపియా, ఈజిప్ట్, యూఏఈ , సౌదీ అరేబియా చేరాయి.
ఈ సంస్థ 17 వ శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్ లో జరిగింది. ఈ గ్రూపు అమెరికాకు ఆధిపత్యానికి సవాల్ విసరాడానికే పుట్టిందని వైట్ హౌజ్ భావిస్తోంది. ఈ దేశాలకు కచ్చితంగా పదిశాతం అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News