యూనస్ రాజీనామా?

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత పదవి నుంచి ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ తప్పుకుంటున్నారా? ఎందుకు ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నారా?;

Update: 2025-05-23 08:12 GMT

బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) రాజీనామా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబుల్ బహుమతి గ్రహీత యూనస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడంతో.. ఉద్రిక్తతలు ఏర్పడుతున్నట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోకే యూనస్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనేక అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అయితే యూనస్ అధికారిక కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

"ఈ రోజు ఉదయం నుంచి యూనస్ రాజీనామా వార్త గురించి విన్నాం. ఈ విషయం గురించి చర్చించడానికి నేను ఆయనను కలవడానికి వెళ్ళాను. దాని గురించి ఆయన ఆలోచిస్తున్నానని చెప్పారు.’’ అని నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహిద్ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా యూనస్ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంది. వాటిలో ప్రధానమైనది బంగ్లాదేశ్ ఏకీకృత సైనిక దళాలు. గత సంవత్సరం ఈ దళాలు తిరుగుబాటులో ఇది కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదే ఉద్యమం మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూల్చివేసి యూనస్‌ను అధికారంలోకి తెచ్చింది. 

Tags:    

Similar News