యూనస్‌‌ ముందుకు బీఎన్‌పీ, ఎన్‌సీపీ డిమాండ్లు..

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతితో పార్టీ నేతల భేటీ;

Update: 2025-05-25 10:28 GMT

దేశంలో డిసెంబర్ 2025 నాటికి జాతీయ ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌ను కోరింది. జమునలోని తన అధికారిక నివాసంలో బిఎన్‌పి ప్రతినిధి బృందానికి యూనస్‌(Muhammad Yunus)కు మధ్య జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ తెరమీదకు వచ్చింది.

ఆ ఇద్దరిని తొలగించండి..

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరించాలని కూడా బిఎన్‌పి సూచించింది. వివాదాస్పద సలహాదారులను తొలగించాలని కోరింది. ముఖ్యంగా మహ్ఫుజ్ ఆలం ఆసిఫ్ మహ్ముద్ షోజిబ్ భూయాన్‌ను పక్కన పెట్టాలని ప్రతిపాదించింది. వీరిద్దరు మాజీ ప్రధాన మంత్రి హసీనా అవామీ లీగ్ పాలనకు వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD) ప్రతినిధులు. ప్రస్తుతం మహఫుజ్ ఆలం యువత, క్రీడలు విభాగం, ఆసిఫ్ మహమూద్ షోజిబ్‌కు సమాచార మంత్రిత్వ శాఖల శాఖను అప్పగించారు.

యూనస్ నాయకత్వానికి యూనస్ జమాతే ఇ ఇస్లామి(Jamaat-e-Islami), నేషనల్ సిటిజన్ పార్టీ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. మహమ్మద్‌ యూనస్‌ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దాదాపు 19 మంది సలహాదారులు, మంత్రులు, ఇతర అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో తమ యూనస్‌తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సంస్కరణలు పూర్తయితే 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని లేదంటే రంజాన్ తర్వాత జరపాలని జమాతే కోరింది. అయితే జాతీయ ఎన్నికలకు ముందు స్థానిక ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించాలని ఎన్‌సీపీ కోరింది.

యూనస్ నాయకత్వంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగడానికి మూడు ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఉందని యూనస్ కార్యాలయం తెలిపింది. 

Tags:    

Similar News