మందుగుండు కొరతతో తల పట్టుకుంటున్న పాక్ జనరల్స్?

కీలకమైన సామగ్రిని ఉక్రెయిన్ కు అమ్మివేసిన పాకిస్తాన్, పహల్గాం ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత్;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-04 12:39 GMT
యుద్ద సన్నాహాల్లో ఉన్న పాకిస్తాన్ సైన్యం

భారత్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం తీవ్రమైన మందుగుండు కొరత ఎదుర్కొంటోందని కొన్ని నివేదికలు బయటకు వస్తున్నాయి. ఆయుధాల కొరత దాని సంసిద్దతను తీవ్రంగా దెబ్బతీస్తోందని, స్వల్పకాలిక ఘర్షణలను కూడా అతి తట్టుకోలేదని తెలుస్తోంది.

పాకిస్తాన్ సైన్యం వద్ద ప్రస్తుతం 96 గంటల వరకూ పోరాడే మందుగుండు సామగ్రి మాత్రమే ఉంది. ఈ పరిణామం ఆ దేశ సైనిక వర్గాలను తీవ్ర ఆందోళన కలిగిస్తోందని జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.

ఉక్రెయిన్ కు ఎగుమతులు..

పాకిస్తాన్ ఇటీవల ఉక్రెయిన్, ఇజ్రాయెల్ లతో చేసుకున్న ఒప్పందాల కారణంగా ఫిరంగి, మందుగుండు సామగ్రి కొరత ఏర్పడింది. దీనివల్ల పాకిస్తాన్ ఆయుధ నిల్వలు తగ్గిపోయాయి.
పాకిస్తాన్ తన భారీ ఫిరంగిదళ షెల్స్, కీలకమైన 155ఎంఎం ఫిరంగి గుండ్లను ఇటీవల ఉక్రెయిన్ కు ఎగుమతి చేసింది. పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి దాని శక్తివంతమైన ఎం109 హోవిట్జర్లు, బీఎం 21 రాకెట్ వ్యవస్థలను ఆందోళనకరంగా తక్కువగా నిల్వ ఉన్నాయని వివరించింది.
పాక్ కష్టాలు మరింత పెంచుతూ.. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు(పీఓఎఫ్) మౌలిక సదుపాయాల కొరత, పరిమిత ఉత్పత్తి సామర్థ్యం కారణంగా మందుగుండును అనుకున్నంత వేగంగా ఉత్పత్తి చేయలేకపోతోంది.
దేశీయ అవసరాలను తీర్చడానికి పీఓఎఫ్ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
మే 2 న జరిగిన స్పెషల్ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో పరిస్థితి తీవ్రత గురించి చర్చించినట్లు తెలిసింది. ఈ వివరాలు పాక్ సైనిక జనరల్ల మదిలో రైళ్లు పరుగెత్తించిందని తెలుస్తోంది.


పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ఆర్ధిక, లాజిస్టికల్ పరిమితులను చాలా సార్లు బహిరంగంగానే అంగీకరించారు. తమ దేశానికి స్థిరమైన యుద్ధ సామర్థ్యం పరిమితం అని ముందుగానే హెచ్చరించారు.
ద్రవ్యోల్భణం, పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలతో అనేక సైనిక విన్యాసాలను నిలిపివేసినట్లు ఆయన అప్పట్లోనే విశదీకరించారు. చాలాసార్లు ఇంధన కొరత, రేషన్ తగ్గించడం, షెడ్యూల్ చేసిన యుద్ద విన్యాసాలను రద్దు చేసినట్లు కూడా ఆయన చెప్పారు.
ఇది పాక్ సైన్యం యుద్ద సన్నత ఏంటో తెలియజేస్తోంది. దీనికి తోడు భయంకరమైన అవినీతి, వ్యాపారాలు పాక్ సైన్యంలో సాధారణమైన అంశం.
భారత్ తో ఘర్షణను ఊహించిన పాకిస్తాన్ ఇప్పుటికిప్పుడు సరిహద్దులలో కొత్త ఆయుధ డిపోల నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే వాటికోసం సరైన రా మెటిరియల్ నిల్వలు లేక అల్లాడుతోంది.
‘‘పాకిస్తాన్ తన మందుగుండు సామగ్రిని సుదుర యుద్దాలకు తరలించింది. కానీ అది ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుపోయింది. దాని ఆయుధ శాలలు మొత్తం ఖాళీగా ఉన్నాయి’’ అని సీనియర్ రక్షణ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు.
‘‘స్వల్పకాలిక ఆర్థిక లాభం కోసం ప్రయత్నించడం దీర్ఘకాలిక వ్యూహాత్మక గాయానికి సిద్దపడినట్లు అయింది’’ అన్నారు. ఇదే నిజమైన పక్షంలో భారత్ భారీ సైనిక చర్యకు దిగితే పాక్ కనీసం పోరాట పటిమ చూపకలేకపోతుందని తెలిసినా సరిహద్దులో మాత్రం సైన్యాన్ని సిద్దంగా నిలిపి బీరాలు పలుకుతోంది
Tags:    

Similar News