ఆపరేషన్ సింధూర్: '100 మంది ఉగ్రవాదులు హతం'

అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి..;

Update: 2025-05-08 09:09 GMT
అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్, టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ.

పహల్గామ్ (Pahalgam) ఊచకోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరిట భారత సాయుధ దళాలు బుధవారం (మే 7) తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి), పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం క్షిపణులతో దాడి చేసింది. ఫలితంగా100 మంది ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు మరణించారని జెఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్ అంగీకరించాడు.

ఇటు పాక్ దళాలు (Pakistani troops) జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి దాడులకు తెగబడుతోంది. మోర్టార్లతో దాడులు చేయడంతో 13 మంది భారతీయ పౌరులు మరణించారని, 59 మంది గాయపడ్డారని విదేశాంగ మంత్రత్వ శాఖ తెలిపింది.

ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులను చేయడంపై భారత వైమానిక దళానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ప్రధాని మోదీ కూడా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షించడానికి శ్రీనగర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.  

Tags:    

Similar News