ఉత్తరాంధ్రలో కూటమి దెబ్బకు వైసీపీ అబ్బా!
ఉత్తరాంధ్రలోని విశాఖ నగరపాలక సంస్థ సహా మిగిలిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయ దుందుభి మోగించింది. ఒక్క చోట కూడా వైసీపీ గెలవలేకపోయింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్తరాంధ్రలో ఏకపక్షంగా వెలువడ్డాయి. జీవీఎంసీ సహా మొత్తం పదకొండు పురపాలక సంఘాలు|నగర పంచాయతీలు కూటమి పరమయ్యాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ వైసీపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా ఈ ప్రాంత ఓటర్లు ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చారు.
విశాఖ ఏయూలో ఓట్ల లెక్కింపులో అధికారులు
పదకొండు చోట్ల ఓట్ల లెక్కింపు..
ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, యలమంచిలి, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని విజయనగరం నగరపాలక సంస్థ, నెల్లిమర్ల, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పాలకొండ నగర పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటి ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం మొదలై రాత్రి వరకు కొనసాగింది. ఉత్తరాంధ్రలో ఎవరు ఎక్కడ నుంచి గెలుపొందారంటే?

పోతిన హనుమంతరావు (తండ్రి - జీవీఎంసీ 6 వార్డు విజేత)
జీవీఎంసీ మేయర్ అభ్యర్థికి రికార్డు మెజారిటీ..
జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన ముక్కా శ్రావణి పోటీ చేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీ, ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి బరిలో నిలిచారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. ఆరంభం నుంచి ఆఖరు వరకు ప్రతి రౌండ్‌లోనూ శ్రావణి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మేయర్ అభ్యర్థులకు మొత్తం 7,18,162 ఓట్లు పోలయ్యాయి. వీటిలో మంగళవారం రాత్రి వరకు లెక్కించిన ఓట్లను బట్టి టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణికి 1,79,749 ఓట్ల ఆధిక్యం లభించింది. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లోకెల్లా ఇదే అత్యధిక (రికార్డు) మెజార్టీ కావడం విశేషం! జీవీఎంసీలో మొత్తం 120 వార్డుల్లో అత్యధిక స్థానాలను కూటమి అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. దీంతో జీవీఎంసీ ఏర్పాటయ్యాక తొలిసారిగా టీడీపీ మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమం అయింది. 2005లో ఈ కార్పొరేషన్ జీవీఎంసీగా అప్‌గ్రేడ్ అయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, మరోసారి వైసీపీలు గెలుపొంది మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వైసీపీ మేయర్ హరివెంకట కుమారిని గద్దె దించి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావును ఆ పదవిలో కూర్చోబెట్టింది. ఏడాదికే పదవీ కాలం ముగిసింది. ఎన్నికల్లో గెలిచి విశాఖ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడం టీడీపీకి ఇదే తొలిసారి.

పోతిన జాహ్నవి (కుమార్తె - జీవీఎంసీ ఏడో వార్డు విజేత)
ఉమ్మడి విశాఖ జిల్లాలో క్లీన్ స్వీప్..
ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు కూటమి పరమయ్యాయి. నర్సీపట్నం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి వైసీపీ అభ్యర్థిని చింతకాయల అనితపై గెలుపొందారు. మొత్తం 40 కౌన్సిల్ వార్డులకు గాను 34 టీడీపీ, జనసేన 3, వైసీపీ ఒకటి, స్వతంత్రులు ఇద్దరు విజయం సాధించారు. అలాగే యలమంచిలి మున్సిపాలిటీని కూటమి పొత్తులో బీజేపీకి కేటాయించారు. అక్కడ పిల్లా రమాకుమారి.. వైసీపీ అభ్యర్థి బోదెపు తులసిపై విజయం సాధించారు. 32 వార్డులకు గాను కూటమికి 25, వైసీపీకి ఆరు వార్డులు లభించాయి.

పలాసలో లక్కీ డ్రా విజేత అరుణ
మిగిలిన మున్సిపాలిటీల్లో ఇలా..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీ ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం, ఆమదాలవలసలకు ఎన్నికలు జరగలేదు. ఇచ్ఛాపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఆసి లీలారాణి గెలుపొందారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఆ పార్టీకి దక్కిన చైర్‌పర్సన్ పదవి ఇది. ఇక్కడ మెజార్టీ కౌన్సిల్ స్థానాలు కూడా కూటమి అభ్యర్థుల పరమయ్యాయి. అలాగే పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని కూడా కూటమే గెలిచింది. చైర్‌పర్సన్‌గా వజ్గా గంగాభవానీ ఎన్నికయ్యారు. పాలకొండ నగర పంచాయతీలోనూ కూటమే పాగా వేసింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ..
విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ పదవి కోసం టీడీపీ నుంచి అవనాపు భార్గవి, వైసీపీ నుంచి శ్రావణి పోటీ పడ్డారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు సాయంత్రం వరకు మొదలు కాలేదు. దీంతో ఫలితం ఆలస్యమవుతోంది, సోమవారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం టీడీపీ అభ్యర్థి భార్గవి 6,970 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే బొబ్బిలి మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం టీడీపీ నుంచి పోటీ పడుతున్న రాంబారికి రేణుకాదేవి, వైసీపీ అభ్యర్థినిపై 5,184 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. కూటమి నేతలు సాలూరు మున్సిపాలిటీని జనసేన అభ్యర్థికి కేటాయించారు. దీంతో అక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థి మంజీరా బరిలో నిలిచారు. ఆమె ఇప్పుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక నెల్లిమర్ల పురపాలక సంఘాన్ని బీజేపీకి కేటాయించారు. దీంతో పొత్తును కాదని బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి లెంక అప్పలనాయుడు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోపక్క విజయనగరం నగరపాలక సంస్థ 32వ వార్డు టీడీపీ అభ్యర్థి కేవలం మూడు ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం.
విశాఖలో తండ్రీ కూతుళ్ల విజయ భేరి..
మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జీవీఎంసీ పరిధిలోని 6, 7 వార్డుల నుంచి వైసీపీ తరఫున తండ్రీ కూతుళ్లు ఎన్నికల బరిలో నిలిచారు. ఆరో వార్డు నుంచి తండ్రి పోతిన అహనుమంతరావు, ఆ పక్కనే ఉన్న ఏడో వార్డు నుంచి అతని కుమార్తె పోతిన జాహ్నవి పోటీ చేశారు. సోమవారం నాటి ఫలితాల్లో వీరిద్దరూ విజయం సాధించారు. దీంతో వారి కుటుంబీకులతో పాటు వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
పలాసలో లక్కీ డ్రాలో విజయం..
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఫలితాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇక్కడ 35వ వార్డు నుంచి టీడీపీ తరఫున జోగ త్రివేణి, వైసీపీ నుంచి అరుణలు పోటీ చేశారు. విచిత్రంగా వీరిద్దరికి 340 ఓట్లే వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో వైసీపీ అభ్యర్థిని అరుణను విజయం వరించింది.

Next Story