చెన్నై నుంచి తిరుమలకు గొడుగుల ఊరేగింపు
x

చెన్నై నుంచి తిరుమలకు గొడుగుల ఊరేగింపు


తిరుమల శ్రీవారికి పురటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామివారి గరుడసేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మార్థ సమితి తరపున గొడుగులు సమర్పించడం ఆనవాయితీ. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది తిరుమల గొడుగుల ఊరేగింపు కోసం చెన్నై లోని చెన్న కేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గొడుగుల యాత్రను ప్రారంభించారు .


ఈ సందర్భంగా హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్.ఆర్. గోపాల్‌జీ మాట్లాడుతూ "పూజలు ఘనంగా జరిగాయి. దక్షిణ భారతదేశంలో గొడుగులు ఊరేగింపు గొప్ప కార్యక్రమం. తిరుకుడై ఊరేగింపులో మాత్రమే 20 లక్షల మందికి పైగా పాల్గొంటానన్నారు లక్షలాది ప్రజల ప్రార్థనలతో, తిరుమల శ్రీవారికి మేము గొడుగులు సమర్పిస్తాం గతేడాది భారీ వర్షాలు కురిసినా లక్షలాది మంది గొడుగుల కోసం ఎదురుచూశారు. ఈ కార్యక్రమానికి వస్తురూపంగాని ధన రూపంగా గాని ఎటువంటి డొనేషన్లు తీసుకోబడవని అన్నారు.



సాయంత్రం 4 గంటలకు బోస్ రోడ్, గోవిందప్ప నాయకన్ స్ట్రీట్ జంక్షన్, భైరాగి మఠం, వాల్డాక్స్ రోడ్ గుండా గోవిని దాటుతుంది





అక్టోబరు 3వ తేదీ నుంచి చెన్నై అయనవరం, విల్లివాక్కం, తిరువళ్లూరు తదితర ప్రాంతాలకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి అక్టోబర్ 7న తిరుమల చేరుకుంటుంది. గొడుగుల ఊరేగింపును తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తారు.





తిరుమల జీయర్ సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు గొడుగులను అందజేస్తారు.


Read More
Next Story