టీటీడీ మరో కీలక నిర్ణయం: కాలిబాట భక్తులకు దివ్వదర్శనం టోకెన్లు
x

టీటీడీ మరో కీలక నిర్ణయం: కాలిబాట భక్తులకు దివ్వదర్శనం టోకెన్లు


తిరుమల ప్రక్షాళనలో భాగంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల పునరుద్ధరణ చేసింది‌. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించింది.





లేకుంటే దర్శనాలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది. గతంలో ఈ పద్ధతి అమలులో ఉన్నప్పటికీ గత పాలక మండలి తీసివేసింది‌. దీంతో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు టోకెన్లు తీసుకుని వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది‌. ఈ క్రమంలో భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని టీటీడీ ఈఓ శ్యామలరావు గుర్తించారు. దీంతో పాత పద్ధతినే అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైల్ రన్ ప్రారంభించారు.





త్వరలో ఈ మార్గంలో 6వేల టోకెన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. తాజా నిర్ణయంతో భక్తులను మోసం చేస్తున్న దళారులకు టీటీడీ చెక్ పెట్టింది.


Read More
Next Story