
TIRUMALA || ప్రారంభమైన టిటిడి పాలకమండలి సమావేశం.!
5400 కోట్ల అంచనాలతో 2025 - 26 టీటీడీ వార్షిక బడ్జెట్
తిరుమలలో పాలక మండలి సమావేశం ప్రారంభమైంది . టీటీడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ బేటీలో సుమారుగా రూ. 5400 కోట్లఅంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
గత ఏడాది వార్షిక బడ్జెట్ రూ. 5141 కోట్లుగా ఉంది. అయితే ఈ సమావేశంలో 30 కు పైగా అజెండా అంశాలపై చర్చించితీర్మానాలు చేయనున్నారని సమాచారం.
సీఎంచంద్రబాబు తిరుమలకు వచ్చిన సందర్భంగా అన్ని రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.అంతేకాదు శ్రీవారి కైంకర్యాలకు ముడి సరుకులు కొనుగోలు కోసం నిధులు విడుదల చేయనున్నారు. దీనికి తోడు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న టిటిడి డిపాజిట్లను వెనక్కు తీసుకొనిజాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫారసులపై కూడాచర్చించనున్నారు.
వేసవి నేపథ్యంలో కొండపై నీటి కొరత లేకుండా చర్యలకు ప్రణాళికల రచనపై చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ ప్రజా నిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై ఈ భేటిలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. వేసవి సెలవులు రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పనపై చర్చించనున్నారు.
Next Story