Tomato Market Crash | రైతుల గగ్గోలు, పడిపోయిన టమోటా ధరలు.!
తిరుపతి జిల్లా మదన పల్లి మార్కెట్‌లో టమాట ధర పతనమైంది. మదనపల్లికి బెస్ట్ క్వాలిటీ టమాట రావడం లేదంటూ వ్యాపారులు రావడం లేదు. దీంతో కిలో టమాట ధర పది రూపాయలకు పడిపోయింది మదనపల్లి తర్వాత టమోటా అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లాలోనే. ఈ జిల్లాలో కిలో టమాట ధర ఐదు రూపాయల నుంచి పది రూపాయలు పలుకుతుంది. ఈ ధర వల్ల రైతుల రవాణా చార్జీలకు కూడా సరిపోదు చేసిన కష్టము పెట్టిన పెట్టుబడి వృథాగా పోయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పత్తికొండ మార్కెట్లో కిలో టమోటా ఆదివారం ఐదు రూపాయలు పలికింది. ప్యాపిలి, ఆస్పరి, బనగానపల్లె, ఎమ్మిగనూరు, నంద్యాల మార్కెట్లలో వినియోగదారులు కిలో టమాటను పది రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు రైతు బజార్లో కిలో టమోటా పది రూపాయలుగా ఉంది. ఈ సీజన్‌లో టమాట పంట రైతులకు కంట కన్నీరు పెట్టిస్తుంది. వరంగల్ జిల్లాలోనూ టమాట ధర పతనమైంది. నెల క్రితం ఇక్కడ కిలో 150 రూపాయలు పలికిన ధర ఇప్పుడు ఐదు రూపాయలకు పడిపోయింది. దీంతో టమాటలను రోడ్లపై పారబోస్తున్నారు రైతులు. ఆరుగాలం శ్రమించి రూ.లక్షల ఖర్చు చేస్తే. కనీసం కూలి కూడా గిట్టుబాటు కావడంలేదని వాపోతున్నారు. రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టమాటా ధరల హెచ్చుతగ్గులతో రైతన్నలలో ఆందోళన నెలకుంది.