Tirumala || కొండ నిండా జనం.. వెంకన్నకు తగ్గని ఆదాయం
x

Tirumala || కొండ నిండా జనం.. వెంకన్నకు తగ్గని ఆదాయం

వేసవి సెలవులు ముగిసినా యాత్రికుల రద్దీ తగ్గలేదు. దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది,




తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శనానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. హుండీలో కానుకలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమలలో వేస‌వి సెల‌వుల ముగిసిన కూడా రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ఐదుకిలోమీటర్ల వరకు క్యూలో యాత్రికులు నిరీక్షిస్తున్నారు. దర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి ఆదాయం కూడా 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంది. తిరుమల చరిత్రలో ఇది కూడా ఓ రికార్డుగా చెప్పవచ్చు.




5 కిలోమీటర్ల క్యూ
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన యాత్రికులతో 24 కంపార్టుమెంట్లు నిండాయి. శిలాతోరణం వరకూ భక్తులు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. గత గురు, శుక్ర వారాల్లో గత ఐదేళ్లలో 60 వేలకు మించని శ్రీవారి భక్తుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు పెరిగింది. శనివారం 90,087 మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం 87,254 మంది దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. సోమవారం 84,179 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.33,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
తగ్గని ఆదాయం
యాత్రికుల సంఖ్య కూడా తగ్గని స్థితిలో శ్రీవారి హుండీకి కూడా ఆదాయం గణనీయంగా పెరగడం ఓ రికార్డు. అందులో బుధవారం 4.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మంగళవారం 4.72 కోట్లు, సోమవారం 4.28 కోట్లు ఆదివారం 4.3 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. శనివారం 4.88 కోట్లు, శుక్రవారం 4.30 కోట్ల రూపాయలు ఆదాయం కానుకల ద్వారా లభించడం ఈసారి ఓ రికార్డుగా నమోదైంది. సాధారణంగా వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీకి తోడు ఆదాయం పెరగడం సర్వసాధారం. సెలవులు తరువాత కూడా ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం లభించింది.

కొండంతా యాత్రికులే..
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలో తోపులాటలు నివారించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. నూతనంగా క్యూ మేనేజ్‌మెంట్ పై అధికారులు దృష్టి సారించారు. అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు, అధిక సంఖ్యలో, ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. క్యూలైన్లు, వైకుంఠ క్యూకాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అన్నపానీయాలు కూడా అందిస్తున్నారు. క్యూలైన్ల మేనేజ్మెంట్‌వల్ల చాలా రోజుల తర్వాత శనివారం 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వరుసగా రెండు రోజులుగా 90 వేల మార్క్‌ను దాటింది.
ఎక్కువ మందికి దర్శనం
తిరుమల కొండపై భక్తుల తాకిడి పెరిగింది. దీంతో భక్తులు త్వరగా దర్శనాలు పూర్తి చేసుకునేలా తీసుకున్న చర్యలతో వారాంతంలో 90 వేలు, సాధారణ రోజుల్లో 70 వేల నుంచి 80 వేల మంది వరకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు తీసుకుంది. గతానికి భిన్నంగా ప్రతి భక్తుడిని లెక్కిస్తున్నారు.క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటున్నారు. ఇలా చేయడంతో భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. టీటీడీ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ వల్ల కంపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ఉన్నారు? దర్శనంకి క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుని శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. క్యూలో ఎక్కడ రద్దీగా ఉంది, ఎక్కడ ఖాళీగా ఉందనే వివరాలను తెలుసుకుని. రద్దీ ప్రాంతం నుంచి ఖాళీగా ఉన్న చోటుకు భక్తులను పంపిస్తున్నారు. దీనివల్ల తోపులాటకు ఆస్కారం లేకుండా పోయింది.

ఫుడ్ కోర్టులు
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. ఏటీసీ, ఏటీజీహెచ్, కృష్ణతేజ గెస్ట్ హౌస్, టీబీసీ, రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. కొత్తగా మరో 15 చోట్ల ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసింది టీటీడీ. భక్తులకు ఎప్పుడు, ఎంతమేరు అన్నప్రసాదం అందిస్తున్నారో వివరాలు తెలుసుకుంటున్నారు. భక్తులకు నిరంతరాయంగా ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. నేడు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.


Read More
Next Story