వారి నీడే వారికి రక్ష
పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వేట అక్టోబర్ 21వ తేదీ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటే.
శాంతి భద్రతల రక్షణలో పోలీసు శాఖ దే కీలకపాత్ర.. అందరూ ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, కుటుంబాలను వదిలి సమాజంలో ప్రజలకు రక్షణ కల్పించడం అనేది పోలీసు శాఖ అత్యున్నత లక్ష్యం. ఈ కర్తవ్య నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడులు, ముష్కరుల చేతిలో ఎందరో పోలీసులు అమరులవుతున్నారు. వారికి వెంట ఉండేది ఆయుధం ఒకటే కాదు. వారి నీడే వారికి రక్షణగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి కాదు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారు అంటే. లద్దాఖ్ పరిధిలోని హాట్ స్ప్రింగ్స్ వద్ద 1959 అక్టోబరు 21న చైనా సైనికులు పెద్ద ఎత్తున ఆకస్మిక దాడి చేశారు. వారితో జరిగిన వీరోచిత పోరాటంలో 10 మంది పోలీసులు అమరులయ్యారు. వారి త్యాగానికి గుర్తుగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల గౌరవార్థం ఏటా అక్టోబరు 21న పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహించే సంప్రదాయం అమలులోకి వచ్చింది.
అందులో భాగంగా సోమవారం పోలీసు అమరవీరులను గుర్తు చేసుకుంటూ రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో స్మారక సభలను నిర్వహించారు. అమరవీరుల మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు.