Tirumala || చిన్నశేషవాహనం పై శ్రీ మలయప్ప..!
x

Tirumala || చిన్నశేషవాహనం పై శ్రీ మలయప్ప..!

తిరుమలలో ఐదు తలల చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.



తిరుమలలో మంగళవారంనాడు రథసప్తమి ఉత్సవం సందర్భంగా రెండో వాహనమైన చిన్నశేష వాహనసేవ ఘనంగా జరిగింది.
సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.


Read More
Next Story