తిరుమలలో దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్
ఉదయం ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా పవన్ కల్యాణ్ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు.
ఆలయం వద్ద టీటీడీ అధికారులు పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి డిక్లరేషన్ బుక్కును శ్రీవారి పాదాల వద్ద ఉంచిన పవన్ కల్యాణ్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు.
తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. అనంతరం డిక్లరేషన్ బుక్ చేతిలో పట్టుకున్న పవన్ కల్యాణ్ శ్రీవారి ఆలయం నుంచి వెలుపలికి వచ్చారు.వారాహి డిక్లరేషన్ బుక్కు చేతిలో పట్టుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుండి నేరుగా శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు.
టీటీడీ శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యతను పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం పవన్ కల్యాణ్ అన్న ప్రసాదం స్వీకరించారు. అక్కడనుండి పవన్ కల్యాణ్, తిరుమలలోని గాయత్రి నిలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు.
గురువారం సాయంత్రం తిరుపతి చేరుకుంటున్న పవన్ కల్యాణ్ తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్ లో ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు.