తిరుమల లడ్డు పై అభ్యంతరకర ట్రోలింగ్...!
x

తిరుమల లడ్డు పై అభ్యంతరకర ట్రోలింగ్...!

తిరుమల లడ్డు తయారీలో చోటు చేసుకున్న వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం చలరేగింది దీనిపై తమిళనాడు అభ్యంతరకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు.


తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు ఉపయోగించారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు ప్రకంపలలు పుట్టించిన వ్యవహారంపై రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి సర్వత్ర వినిపిస్తున్న ఆరోపణ. ఇది కాస్త హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే వారే కాదు. తిరుమల శ్రీవారిని ఆరాధించే భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది చాలానట్టు చెప్పడానికి కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో తమిళనాడులో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇవి చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శనివారాలు, పెరటాసి మాసం కూడా ఇదే సందర్భంగా ప్రారంభమైంది తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కన్నున్నాయి ఈ నేపథ్యంలో ఈ తిరుమల శనివారాలను తమిళనాడులో అత్యంత ప్రీతీ , భక్తి భావంతో స్వామివారిని ఆరాధించడానికి నియమ నిష్టలు పాటిస్తారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తిరుమల శ్రీవారి మాల ధారణ చేసే భక్తులు పసుపు దుస్తులు కూడా ధరిస్తారు తమిళనాడులో అంత భక్తి భావంతో ఇలా స్వామివారి సేవలో తరించడానికి సమయం కేటాయిస్తారు. ఈ పరిస్థితిలో తమిళనాడులో కొందరు ఆకతాయి యూట్యూబర్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న తీరు పై భక్తులు కలత చెందుతున్నారు

తిరుమల శ్రీవారి లడ్డుప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసిందనే ప్రభుత్వ ఆరోపణలు , బయటపెట్టిన నివేదిక ఆధారంగా సోషల్ మీడియాలో తార స్థాయికి చేరాయి .
తమిళనాడులో ఒక యూట్యూబర్ ఏకంగా
"బీఫ్ కావాలా. మనం తిరుమలకు వెళ్లి తింటాం రండి" అంటూ ఒకరు. " మరొకరు వెజ్ లడ్డు కావాలా నాన్ వెజ్ లడ్డు కావాలా అంటూ మరొకరు రీల్స్ ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందించి తిరుమల శ్రీవారి ప్రతిష్ట, పవిత్రతను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భక్తుల నుంచి వినిపిస్తుంది.


Read More
Next Story