అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు..!
x

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు..!


టాలీవుడ్‌ స్టార్‌ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్‌ ఇచ్చింది. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో A-11గా ఉన్న ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు. పుష్ప నటుడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా. తనపై నమోదైన కేసులను క్వాష్‌ చేయాలని అల్లు అర్జున్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతున్నది. హైకోర్టు తీర్పు అనంతరం అల్లు అర్జున్‌ రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పుష్ప నటుడు నాంపల్లి కోర్టులో ఉన్నారు.


Read More
Next Story