Tirumala || తిరుమలలో  శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.
x

Tirumala || తిరుమలలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం


తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం 78,821 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని కృష్ణతేజ అతిథి గృహం వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు.


ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యి ఫలితాలు వెలువడటం, 10 వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. గ‌త 10 రోజుల్లో శ్రీ‌వారి మెట్టు, అలిపిరి న‌డ‌క మార్గాల్లో భారీ స్థాయిలో భ‌క్తులు తిరుమ‌లకు చేరుకొని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.



Read More
Next Story