
ఒంటిమిట్టలో హరిధ్రా ఘటనం తో మొదలైన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో గురువారం హరిధ్రా ఘటనం - పసుపు దంచే సాంప్రదాయ కార్యక్రమం ప్రారంభమైంది.
హిందూ సనాతన ధర్మంలో, ఏదైనా శుభ కార్యక్రమం లేదా సాంప్రదాయ కార్యక్రమాలు పసుపు పొడి తయారీతో ప్రారంభమవుతుంది.
ఆలయ అర్చకులు మనోజ్ స్వామి మాట్లాడుతూ , హరిధ్రా ఘటనం సమయంలో తయారు చేసిన పసుపు పొడిని వార్షిక బ్రహ్మోత్సవాలలో అభిషేకం, కళ్యాణం, అక్షింతలు తయారీలోను, పలు శుభకార్యాల్లో ఉపయోగిస్తారన్నారు. వందలాది మంది మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు రామనామ స్మరణతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టిటిడి మహిళా ఉద్యోగులు ఈ సందర్భంగా 'సారె' సమర్పించారు. ఈనెల 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
06-04-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం)
రాత్రి – శేష వాహనం
07-04-2025
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం
08-04-2025
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం
09-04-2025
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం
10-04-2025
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ
11-04-2025
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము
12-04-2025
ఉదయం – రథోత్సవం
13-04-2025
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం
14-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
Next Story