తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ..!
x

తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ..!

వాహన సేవలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్.


గురు పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో గురువారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది.


సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.


వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.






Read More
Next Story