మానసిక ఆరోగ్యానికి చేయూత
x

మానసిక ఆరోగ్యానికి చేయూత

లివ్ లవ్ లాఫ్‌తో చేతులు కలిపిన చెన్నై FICCI FLO..


Click the Play button to hear this message in audio format

కమ్యూనిటీ ఆధారిత మానసిక ఆరోగ్య(Mental Health) కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య మహిళా విభాగం FICCI FLO చెన్నై, లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

జనవరి 21న చెన్నైలో మానసిక ఆరోగ్యం(Mental illness)పై జరిగిన ‘మైండ్ మ్యాటర్స్’ కార్యక్రమంలో లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ సీఈవో అనిషా పదుకొనే, గివింగ్ మ్యాటర్స్ సీఈవో రింకు మేచేరి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఫెడరల్ మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది. అట్టడుగు స్థాయి వర్గాలకు సేవలు చేరేలా దీర్ఘకాలిక ప్రయత్నాల అవసరాన్ని వక్తలు నొక్కి చెప్పారు.

2015లో నటి దీపికా పదుకొనే స్థాపించిన లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్.. విద్య, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. కార్యక్రమంలో ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి,దీపిక సోదరి అయిన అనిషా పదుకొనే మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. "మానసిక అనారోగ్యం కారణంగా ఎవరూ ప్రాణాలు విడవకూడదని, సకాలంలో వారికి కౌన్సిలింగ్ ముఖ్యమని చెప్పారు. తమిళనాడులోని తిరువళ్లూరు, మధురై, తేనితో సహా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

'నిశ్శబ్ద మహమ్మారి'

మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 గురించి ప్రస్తావిస్తూ.. మానసిక ఆరోగ్య సంరక్షణ హక్కుగా ఉన్నా.. ఆచరణలో అంతరాలు ఉన్నాయని అనిషా అభిప్రాయపడ్డారు. మానసిక అనారోగ్యాన్ని "నిశ్శబ్ద మహమ్మారి"గా అభివర్ణిస్తూ.. జీవితంలోని ఏ దశలోనైనా అది బయటపడవచ్చని అన్నారు.

Read More
Next Story