మ్యాప్ంగ్ కాని ఓటర్లను విచారించొద్దు..
x

'మ్యాప్ంగ్ కాని ఓటర్లను విచారించొద్దు..

జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించిన పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని జిల్లా ఎన్నికల అధికారులకు ఈసీ (EC) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 2002 ఓటర్ల జాబితా డిజిటలైజేషన్‌కు సంబంధించి బిఎల్‌వో యాప్‌లో "అన్‌మ్యాప్డ్" గా గుర్తించిన ఓటర్లను మళ్లీ విచారణకు పిలవొద్దని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. రాష్ట్రంలో 2002లో S.I.R నిర్వహించారని, అప్పటి ఓటర్ల జాబితా PDF వెర్షన్‌ను CSV ఫార్మాట్‌లోకి మార్చడంలో తలెత్తిన సాంకేతిక సమస్య తలెత్తిందని పేర్కొంది.

2002 ఓటర్ల జాబితా హార్డ్ కాపీని పరిశీలించేటప్పుడు లేదా ఫిర్యాదులు అందిన తర్వాత తేడా గుర్తిస్తే సంబంధిత ఓటర్లను నోటీసులు జారీ చేసి తర్వాత విచారణకు పిలవాలని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న SIR కార్యక్రమంలో భాగంగా.. ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఈ సూచనలు అన్ని DEOలకు పంపించారు.

Read More
Next Story