ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా
x

ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనీ నిర్ణయించుకున్నాను అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు.


ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనీ నిర్ణయించుకున్నాను అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన రాజీనామాపై స్పందించారు.

కాగా, జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు.నిన్నటి నుండి పార్టీ పెద్దలు ఆయనకి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ నిన్న తనతో మాట్లాడారని జీవన్ రెడ్డి తెలిపారు. అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తనకి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. "నా ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగింది. కానీ పార్టీ మారే ఆలోచన లేదు. ఇక రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను" అని జీవన్ రెడ్డి అన్నారు.

జీవన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే...

ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు..నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది..ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా. ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Read More
Next Story