TIRUMALA || తిరుమలలో భక్తుల కారులో నుంచి మంటలు..!
x

TIRUMALA || తిరుమలలో భక్తుల కారులో నుంచి మంటలు..!

అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే పూర్తిగా దగ్థం


తిరుమలలో (Tirumala) కారులో మంటలు కలకలం రేపాయి. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ దగ్గర ఆగిఉన్న కారులో ఒక్కసారిగా మంటలు(Car Fire) చెలరేగాయి. భక్తులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు (Ongole) చెందిన భక్తుల తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న రెనాల్ట్ డస్టర్ కారులో పొగను గమనించినారు. వెంటనే అప్రమత్తమై కారులో నుంచి దిగిపోయారు. కొన్ని క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు (Car) మొత్తం కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Read More
Next Story