తిరుపతికి వరుసగా బాంబు బెదిరింపులు...!
టెంపుల్ సిటీ తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వరుస బాంబు బెదిరింపులతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపారు అగంతులు. బెదిరింపు ఈమెయిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు. ఈమెయిల్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు.అంతకుముందు తిరుపతిలోని హోటల్స్‌కు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు అగంతులు. బాంబు పెట్టామంటూ ఈమెయిల్స్ పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరంలో ప్రతీ హోటల్‌ను తనిఖీ చేశారు. అవి ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారు.
కేటీ రోడ్డులోని ఆలయాల్లో బాంబు పెట్టామని శనివారం బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్నిఆలయాలను డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీ చేశారు. అటు ముందు జాగ్రత్తగా తిరుపతితో పాటు తిరుమల వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ప్రతీ రెండు రోజులకు ఒకసారి తిరుపతిలోని అన్నిహోటల్స్, జనసంచార ప్రదేశాల్లో తనిఖీలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపు రావడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతున్నవారిపై పోలీసులు ఫోకస్ చేశారు.
Next Story