
భివాండి, నవీ ముంబై కార్పొరేషన్ ఎన్నికల బరిలో AAP
దెబ్బతిన్న రోడ్లు, అరకొరగా వైద్య సౌకర్యం, తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలే ప్రచారాస్త్రాలు..
భివాండి, నవీ ముంబైలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్( Civic polls) ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సమాయత్తమవుతోంది. ఇక్కడ AAP తొలిసారి బరిలో దిగుతుంది. 111 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని యోచనలో ఉన్నట్లు నవీ ముంబై(Mumbai) యూనిట్ అధిపతి దినేష్ ఠాకూర్ తెలిపారు. థానే నగరంలోని 131 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపుతామని, ఇప్పటికే ఆశావాదుల నుంచి 40 కి పైగా దరఖాస్తులు వచ్చాయని థానే యూనిట్ అధ్యక్షుడు అమర్ ఆమ్టే తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, అరకొరగా వైద్య సౌకర్యం, తాగునీటి కొరత, పారిశుద్ధ్య సమస్య, మునిసిపల్ కార్యాలయాల్లో అవినీతిని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీ, పంజాబ్లోలాగా ప్రజా సంక్షేమం ఆధారంగా పాలనా నమూనాను అమలు చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
థానే, భివాండి-నిజాంపూర్, నవీ ముంబైతో సహా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరుగుతుంది. మరుసటి రోజు ఫలితాలు వెలువడతాయి.

