TIRUPATI || తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలోకి దూరిన పాము..!
x

TIRUPATI || తిరుపతిలోని టీటీడీ ఈవో బంగ్లాలోకి దూరిన పాము..!

పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా కాటు వేసిన వైనం


టీటీడీ ఈవో శ్యామలరావు( TTD Eo shyamala rao) నివాసం ఉండే తిరుపతిలోని బంగ్లాలోకి నిన్న రాత్రి భారీ నాగుపాము(Cobra) దూరింది. పామును పట్టుకునేందుకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ నాయుడు(Ravinder Naidu) బంగ్లాకు వచ్చారు. చాకచక్యంగా పామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుండగా. ఊహించని విధంగా ఆయన చేతిపై పాటు కాటు వేసింది.

అక్కడున్న సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్ ఆసుపత్రికి (Swims Hospital)తరలించారు. వైద్యులు ఆయనకు యాంటీ వీనమ్ మందులతో చికిత్స చేశారు.

దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రస్తుతం రవీందర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Read More
Next Story