తమిళనాడు లో బాలుకు అరుదైన గౌరవం..!
తెలుగు, తమిళ్, కన్నడం, హిందీ, మళయాలంతో పాటు మొత్తం 16 భాషల్లో పాటలు పాడి వరల్డ్ రికార్డ్ తో పాటు ఎన్నో రికార్డ్ లను సొంతం చేసుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(బాలు). ఆయన 2020లో కరోనాతో మృతి చెందారు. కరోనా మహమ్మారి తీసుకెళ్లిపోయిన గొప్ప వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు అంటూ ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతి రోజూ ఆయన పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి గొప్ప గాయకుడికి మరో గౌరవాన్ని కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి ఎస్పీ చరణ్ చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయనకి ఆ రోడ్డు తో ఉన్న అనుబంధం కారణంగా పేరు పెట్టడం ఆయనకి ఇచ్చే గౌరవం అవుతుందని సీఎం కి విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ బాలు గారి వర్ధంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు ఇకపై నుంచి కాందార్ నగర్ మెయిన్ రోడ్డు ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పిలవాలని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
Next Story