
తిరుచానూరు సందర్శించిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్
ఆమ్మవారి ఆశీస్సులు తీసుకున్న సిపి రాధాకృష్ణన్
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తిరుపతికి వచ్చారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి వీరికి ఆలయం వద్ద, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
టీటీడీ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థం ప్రసాదాలను అందజేశారు.
దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కాగా, రాష్ట్రంలోని టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ఎలాగో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండగా విపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సైతం ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు అని స్పష్టం చేసిన విషయం విదితమే.
దీంతో, ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల అందరి ఓట్లు కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌కే పడే అవకాశం ఉంది. మరోవైపు, ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆసక్తికరంగా మారింది.