640 మంది విద్యార్థినుల ప్రాణాలు కాపాడిన ఉపాధ్యాయులు
ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాన్ని వరద చుట్టుముట్టింది. అలర్ట్ అయిన ఉపాధ్యాయులు పిల్లలను కాపాడి శభాష్ అనిపించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు (G. Konduru) మండలం కుంటముక్కల (Kuntumukkala) లో ఉన్న డాక్టర్ బిఆర్అంబేద్కర్ గురుకుల విద్యాలయం (Social Welfare Gurukul School and College)కు అప్రమత్తంగా ఉన్న ఉపాధ్యాయుల వల్ల వరదప్రమాదం తప్పింది. కుంటుముక్కల (కుంటాముక్కల)విజవాడ పట్టణానికి 40 కిమీ దూరాన ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ఈ విద్యాలయానికి వరద ముప్పు ఏర్పడింది. అక్కడు చదువుకుంటున్న 640 మంది విద్యార్థినులు వరదల్లో చిక్కుకుపోయారు. అయితే, వీరందరిని టీచర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ విషయం ఆలస్యం టీచర్స్ డే (Teachers' Day) సందర్భంగా వెలుగులోకి వచ్కింది.
విద్యార్థినులు భోజనాలు ఇంకా పూర్తి కాలేదు. భోజనాలు పూర్తయిన వారు డార్మిటరీలకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వెంకటాపురం వాగు పొంగి వరదనీరు ప్రవహించడం మొదలుపెట్టింది. కాంపౌండ్ వాల్ ను తోసుకుని లోపలికి ప్రవేశించింది. డార్మిటరీస్ లోకి ప్రవేశిస్తూ ఉంది. కళాశాలకు వరద నీరు చుట్టూ ముడుతూ ఉందని వెంటనే ఖాళీ చేయకపోతే ప్రమాదమని మొదటు కాలేజీ ప్రిన్స్ పాల్ కనపర్తి విజయలక్ష్మి గమనించారు. ఆమె వెంటనే కేకలు వేస్తూ ఇతర ఉపాధ్యాయులను, విద్యార్థలను అప్రమ్తం చేయడం మొదలుపెట్టారు. అప్పటికే కాలేజీలోకీ నీరు ప్రవేశించింది. డార్మిటరీలలో నడుములు లోతుదాకా వచ్చాయి. పిల్లలు ఆర్తనాదాలు చేయడం ప్రారంభించారు. ప్రిన్సిపాల్ వెంటననే స్థానిక అధికారులకు ఈ సమాచారం చేశారు. తర్వాత జిల్లా అధికారులకు ఎదురవుతున్న వరద ముప్పు గురించి చెప్పారు. ఆదుకోవాలని ఫైర్ స్టేషన్ (Fire Station) వారిని అలర్ట్ చయేశారు. ఎన్ డిఆర్ ఎఫ్ రెస్క్యూ టీమ్ (NDRF Team) వారికి ఫోన్లు చేశారు.
అదే విధంగా జిల్లా కలెక్టర్ స్రుజనకు ఫోన్ చేసి కళ్ల ముందుకు వచ్చిన వరద నీటి గురించి వివరించారు. దీంతో కలెక్టర్ జి కొండూరు మండల తహశీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. తహశీల్దార్ వెంటనే ఎంఈవో (MEO) పీవీ నరసింహారావు, కుంటముక్కల విఆర్ఎ (Village Revenue Assistant), ఎస్ రాజేష్, చెవుటూరు విఆర్ఎ (VRA) మిండం పాండురంగారావు, కాలేజీ కమిటీ చైర్మన్ కోటా రవిలు ఉపాధ్యాయులను అలర్ట్ చేశారు. ఈలోపు కుంటముక్కల నుంచి పది ట్రాక్టర్లు కాలేజీ ఆవరణకు రప్పించారు. అప్పటికి వరద నీటి కళాశాల నిండిపోయింది. వెంటనే ఉపాధ్యాయులంతా విద్యార్థినులను తరలించడం మొదలుపెట్టారు. కొందరిని భుజాలపై వేసుకుని ట్రాక్టర్లలోకి ఎక్కించారు. ఈ లోపు రెస్క్యూ టీం కూడా వచ్చింది. మొత్తం విద్యార్థులందరిని పక్కనే ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు. దీనితో విద్యార్థులంతా డార్మిటరీలోనే పుస్తకాలు, ట్రంకులను వదిలపెట్టి రావలసి వచ్చింది. ఉపాధ్యాయులు అలర్ట్ గా ఉండటం వల్ల విద్యా ర్థినులను అధైర్య పడకుండా వారికి ధైర్యం చెప్పుకుంటూ కాలేజీ ఆవరణ నుంచి పక్కనే చెవుటూరు హైస్కూలుకు తరలించారు.
చెవుటూరు హైస్కూలులో ఆ రాత్రి...
హైస్కూలులో కుంటమక్కల గ్రామానికి చెందిన వారు విద్యార్థినుల కోసం భోజనం ఏర్పాటు చేశారు. స్థానికులు చొరవ తీసుకుని స్కూల్లో జనరేటర్ ఏర్పాటు చేశారు. శనివారం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనరేటర్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించడంతో విద్యార్థినులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు ప్రిన్స్ పాల్ విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆరోజు సాయంత్రానికి కొందరు విద్యార్థినులను తల్లిదండ్రులు ఇండ్లకు తీసుకుపోయారు. సోమవారం నాటికి విద్యార్థినులు అందరూ ఇండ్లకు చేరుకున్నారు.
1984లో కట్టిన భవనం
గురుకుల పాఠశాల నిర్మాణం 1984లో జరిగింది. ఆ తరువాత కొంత కాలానీకి స్కూలును కాలేజీగా అప్ గ్రేడ్ చేశారు. పిల్లలు పెరిగినా భవనాల సంఖ్య పెరగలేదు. పైగా డార్మిట్రీ పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. స్కూలు ఆవరణ కూడా పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. పనికిరాకుండా పోయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలేజీ కోసం నిర్మించిన భవనాలు తప్ప స్కూలు కోసం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం నిర్మించిన భవనాలు అలాగే ఉన్నాయి. ప్రస్తుతం టార్మిట్రీ, స్కూలు భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది.
కాలేజీ నిండా నీరు
ప్రస్తుతం కాలేజీ ఆవరణ అంతా వరదనీరుతో ఉంది. డార్మిట్రీ నుంచి నీరు బయటకు వచ్చింది. విద్యార్థినుల ట్రంక్ బాక్స్లు పనికి రాకుండా పోయాయి. పుస్తకాలు కూడా నీటిలో నానాయి. కాలేజీ ఆవరణలోని నీరు ఎప్పుడు బయటకు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాలేజీ ఆవరణలో వేసిన రోడ్లు నీటి కోతకు గురై గోతులు పడ్డాయి.
నేడు రెడ్ అలర్ట్
బుధవారం కురిసిన వర్షాలకు తిరిగి వరదనీరు స్కూలు ఆవరణలోకి వస్తోంది. గురువారం మద్యాహ్నం నుంచి స్కూలు ఆవరణలో ఎవ్వరూ ఉండొద్దని తహశీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. గురువారం ఉదయం స్కూలుకు వచ్చిన ప్రిన్స్ పాల్ సిబ్బంది అధికారుల హెచ్చరికలతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ అధికారుల సూచన మేరకు ఇక్కడి నుంచి వెళుతున్నామని, తిరిగి వారు వరద తగ్గిందంటేనే వస్తామని చెప్పారు.
ఇండ్లకు చేరిన విద్యార్థినులు
రెండు రోజుల క్రితం విద్యార్థినులు ఇండ్లకు చేరారు. తల్లిదండ్రులకు ప్రిన్స్ పల్ ఫోన్ లు చేసి విద్యార్థుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఇంటివద్దనే ఉన్నారని తల్లిదండ్రుల నుంచి సమాచారం తీసుకున్నట్లు ప్రిన్స్ పాల్ తెలిపారు. వెంకటాపురం వాగులను ఆనుకుని ఈ స్కూలు భవనం నిర్మించినందున వెంకటాపురం వాగు ఉప్పొంగి స్కూలు ఆవరణలోపలికి వరద నీరు ప్రవేశించిందని ప్రిన్స్పాల్ తెలిపారు. చెవుటూరు ప్రజలు అందించిన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. ఇంత మంది పిల్లలకు స్కూలులో బస ఏర్పాటు చేయడం, భోజనాలు చేయించి పెట్టడం ఎప్పటికీ నేను, మా సిబ్బంది మరిచిపోలేమన్నారు. మా ఉపాధ్యాయులతో పాటు వంట మనుషులు దాసు, నాగేశ్వరరావు, అద్రుష్టంల సహకారం కూడా మరువలేమన్నారు. వారు కూడా విద్యార్థినులను బయటకు తరలించడంలో పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు.
చాలా స్కూళ్లలో భవనాలు శిథిలావస్థకు చేరాయి
ఎన్టీఆర్ జిల్లాలోని సుమారు 16 స్కూళ్లలో భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కో ఆర్డినేటర్ కె ప్రేమావతి తెలిపారు. ఆమె గురువారం ఫెడరల్ తో మాట్లాడుతూ కుంటముక్కల స్కూలు, కాలేజీలో విద్యార్థినులను కాపాడిన స్కూలు టీచర్లతో పాటు ప్రధానంగా స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ కోటా రవిని అభినందించారు. అందరి సహకారంతో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలిగామన్నారు. జిల్లాలలోని గురుకుల స్కూళ్ల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.
పూర్తిగా మునిగిన డార్మిట్రీ
గురుకుల స్కూలుకు చుట్టూ ఏర్పాటుచేసిన కాంపౌండ్ గోడ చాలా చోట్ల వరద తాకిడికి కూలిపోయింది. అప్పటి వరకు గోడకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీరు ఒక్కసారిగా కాలేజీ ఆవరణలోకి రావడం డార్మిట్రీని ముంచెత్తడం అరగంట వ్యవధిలో జరిగిపోయాయి. పెట్టెల్లో ఉన్న పుస్తకాలు, పిల్లల వస్తువులు పూర్తిగా నీట మునిగాయి. నీరు పూర్తిస్థాయిలో రావడంతో స్కూలు ఆవరణ సముద్రంలా మారిపోయింది. బయటకు నడిచేందుకు కూడా ఎటువైపు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
640 మంది విద్యార్థినులను పది మంది టీచర్లు ఎంతో చాకచక్యంగా భుజాలపై వేసుకుని మోసుకొచ్చి ట్రాటక్టర్లలోకి ఎక్కించడం పలువురిని ఆశ్చర్య పరిచింది. టీచర్లు ఆసమయంలో వరద ముంపు కోసం ఏర్పాటు చేసిన వారియర్లుగా పనిచేశారు. ప్రిన్స్ పల్ విజయలక్ష్మి వారి సేవలను అభినందించారు.