తిరుమల జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు..!
x

తిరుమల జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు..!



వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది.
ఈ షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ సెప్టెంబర్ 27వ తేదీన సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరుతారు. రాత్రి 7 గంటలకు జగన్ తిరుమలకు చేరుకుంటారు.
ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీన శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్తారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్‌ హౌస్‌కు బయలుదేరుతారు. ఆ తరువాత 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంటకు వెళతారు. 1.20 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి జగన్ వెళ్తారు.


Read More
Next Story