ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయింది! ‘రాజాసాబ్’ పోస్టర్ రిలీజ్!
x

ప్రభాస్ కొత్త లుక్ అదిరిపోయింది! ‘రాజాసాబ్’ పోస్టర్ రిలీజ్!

హారర్, కామెడీ జానర్‌లలో ఈ చిత్రం రూపొందుతోందని అంటున్నారు. సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు హడావుడి మొదలయింది. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘రాజా సాబ్’ యూనిట్ ఇవాళ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. పోస్టర్‌లో ప్రభాస్ స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. “మేము మొదలుపెట్టిన ఈ క్రేజీ జర్నీలో… మేము రూపొందించిన డార్లింగ్ రెబెల్ పాత్రతో… అక్టోబర్ 23న వస్తున్నాడు” అని యూనిట్ బృందం పోస్టర్ డిస్క్రిప్షన్‌లో రాశారు.

అక్టోబర్ 23న రాజాసాబ్ టీజర్ విడుదల చేయనున్నామని, 2025 ఏప్రిల్ 10న చిత్రం విడుదల అవుతుందని కూడా పోస్టర్‌లో పేర్కొన్నారు. పీపుల్స్ మీడియా నిర్మాణంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సరసన మాళివికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హారర్, కామెడీ జానర్‌లలో ఈ చిత్రం రూపొందుతోందని అంటున్నారు. సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‍లో షూటింగ్ జరుగుతోంది. మరోవైపు రాజాసాబ్ బిజినెస్ కూడా మొదలయిపోయింది. ఆడియో హక్కులను టీ సిరీస్ రు. 25 కోట్లకు సొంతం చేసుకుంది.

Read More
Next Story