ఇది మంచి ప్రభుత్వం అని ఎలా చెబుదాం?
x

ఇది మంచి ప్రభుత్వం అని ఎలా చెబుదాం?

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తమకు తాముగా నిర్ణయించి తమ ప్రభుత్వానికి పెట్టుకున్న పేరు ‘ఇది మంచి ప్రభుత్వం’. వంద రోజుల పాలన సక్సెస్‌ అంటూ ఊరూ, వాడా ప్రచారం.


ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు చాటి చెప్పండి. మనం ఇచ్చిన హామీలు వరుసగా అమలు చేద్దాం. ఏ వర్గాన్ని విస్మరించేది లేదు. త్వరలోనే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తా. కార్యకర్తలే మన బలం. వారి త్యాగాలను మరువొద్దు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడాన్ని పార్టీల్లో కొందరు స్వాగతిస్తున్నా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ఎవరైనా నిలదీస్తే వాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రస్తుతం సామాజిక పెన్షన్‌ల పథకం ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నాం. మిగిలినవేవీ ఇంకా కార్యరూపం దాల్చ లేదు. అలాగని ఆ పథకాలను విస్మరించేది లేదు. కానీ ఆ మాట చెప్పి మేము పక్కకు వస్తే ఓట్లేసిన ప్రజలు ఊరుకుంటారా? అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వారిలో వారు మథనపడుతున్నారు.

కూటమి ప్రభుత్వం జగన్‌ అమలు చేసిన డీబీటీ పథకాలతో పాటు సూరప్‌ సిక్స్‌ పథకాలు అమలు చేసి తీరుతామని, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఇప్పటికీ గంటా పదంగా చెబుతున్నారు. అందువల్ల జరుగుతున్న పరిణామాలు, సంక్షేమ పథకాల అమలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి. ప్రజలకు సమగ్రంగా క్లారిటీ ఇచ్చే పరిస్థితుల్లో మేము లేమని ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినా.. నేను చెప్పింది చేయండి. మన మీద మన ఓటర్లుకు నమ్మకం ఉంది. విమర్శించే వారు ఎలాగు ఉంటారు. వారినేమీ పట్టించుకోవద్దు. అంత అవసరం లేదు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే.. మంచి చేస్తున్నాం. ‘ఇది మంచి ప్రభుత్వం’ అని చాటి చెప్పండి.
తప్పేముంది. వాళ్లు గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని ప్రభుత్వ నిధులతో చేయలేదా.. మనం దానిని చూడ లేదా.. మనం అన్నీ చేస్తాం. కానీ జగన్‌ మాదిరిగా ఒక్క రోజులోనే అన్ని చేశామని చెప్పి చేతులెత్తేయలేం. సమయం ఉంది. నిదానంగా చేద్దాం. గత ప్రభుత్వ పాలన రాష్ట్రానికి ద్రోహం చేసిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిపై అప్పు ఉందని అందరికి తెలుసు. ఇప్పుడు మనం అలా కాదు. కేంద్రం మనకు అండగా ఉంది. ఖచ్చితంగా మనం సక్సెస్‌ అవుతాం. మీరు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఇది మన ప్రభుత్వం. మీరు కోరుకున్న ప్రభుత్వం. మీకు చెప్పింది చేసే ప్రభుత్వం. అనే విషయాలను చాటి చెప్పగలిగితే మన ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోగలుగుతాం. సక్సెస్‌ అవుతాం. అంతే కానీ మనమేదో చెప్పిన హామీలన్నీ అమలు చేయడం లేదని, అది మనకు నెగిటివ్‌ అవుతుందని మీ మనసుల్లో ఉన్నది పక్కన పెట్టండి. ఎప్పుడైతే మీరు మారుతారో. అప్పుడే ప్రజలు మన వైపు ఉంటారు.
ఈ రాష్ట్రంలో అఖండ మెజారిటీ ఇచ్చారు. ఇది ఊహించని మెజారిటీ. మనం ఎలా అయితే ఊహించ లేదో.. మన ఓటర్లకు కూడా ఊహించని విధంగా మనం సాయం అందిస్తున్నామనే మెస్సేజ్‌ వాళ్ల మనసులను తాకాలి. అప్పుడే మనం సక్సెస్‌ అయినట్లు. మనపై ఉద్యోగ వర్గాలు, పేద వర్గాల్లో ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశలను నెరవేర్చడం మన బాధ్యత. అందుకే చెబుతున్నా. మీరు ఇంటింటికి వెళ్లండి. ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేయండి. అప్పుడే మనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. లేదంటే.. మనందరం పునరాలోచించుకోవలసి ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త. అనే రీతిలో చంద్రబాబు నాయుడు నాయకులకు చెప్పాడంటే ఎంత గట్టిగా కసరత్తు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇవి అలా ఉంచితే.. 100 రోజుల పాలనపై అసలు మేధావి వర్గం ఏమంటోంది. ఎందుకు ఒక్కరు కూడా ఇప్పటి వరకు స్పందించ లేదు. కనీసం ప్రతిపక్షం కూడా 100 రోజుల పాలనపై వారు భావించిన రీతిలో కామెంట్స్‌ చేయలేదు. ఇప్పుడంతా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి పైనే చర్చ సాగుతోంది. అది ఏస్థాయికి వెళ్లిందంటే పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు సైతం చర్చించుకుంటున్నారు. కొందరు నమ్ముతున్నారు. కొందరు నమ్మడం లేదు. కల్తీ నెయ్యితో ఆ కలియుగ దైవం లడ్లు తయారు చేస్తున్నారంటా. ఇంత కంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా అనే చర్చ తప్ప మరో చర్చ ఈ ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తెరపైకి రాలేదంటే అతిశయోక్తి కాదు.
సమస్యలపై ప్రశ్నిస్తారనుకున్నప్పుడు ఇటువంటి డైవర్షన్‌ రాజకీయాలు తెరపైకి వస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం వివేషం. మొత్తానికి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సక్సెస్‌ అయిందా? లేదా? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయం ముఖం చూడకుండా ఐదు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రతినిధులు చెప్పారని చెప్పలేము. ఎందుకంటే అక్కడక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడి వచ్చారు. అయితే బహిరంగంగా ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించలేదు.
ఇచ్చిన హామీలను చూస్తే భయమేస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు హామీలన్నీ అమలు చేస్తారా? లేదా? అనే సందేహం మాత్రం ప్రజల్లో ఉంది. ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణం వంటి పథకాల కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.
Read More
Next Story