బుడమేరు గండ్లు ఎవరు.. ఎలా పూడ్చారో తెలుసా?
విజయవాడ మునిగిపోవడానికి కారణమైన బుడమేరు కాలువ గండ్లు పూడ్చేందుకు ఎవరు ఎటువంటి పనులు చేశారు? ఆ కాలువ గండ్లు ఎవరు పూడ్చారు? ఎలా ముంపు నుంచి బయట పడ్డారు.?
9 రోజుల నుంచి బుడమేరు పొంగి పొర్లింది. ఈ డ్రైనేజీ కాలువ వల్ల వేల కుటుంబాలు వీధుల్లో పడ్డాయి. వరదలకు సుమారు ఐదు లక్షల మంది వరద ముంపుకు గురయ్యారు. కాలువకు పడిన గండ్లను పూడ్చేందుకు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కాలువ గండ్లు పూడ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో భారత ఆర్మీ రంగంలోకి దిగింది.
పనులు ఇండియన్ ఆర్మీ ఇంజనీర్ల చేతిలోకి వెళ్ళాక మరింత వేగం పుంజుకున్నాయి. ఇనుప జాలీల్లో రాళ్లను నింపి ఆర్మి జవాన్లు గండి పూడ్చివేత పూర్తి చేశారు. ఒక్కొక్కటి 522 మీటర్ల పరిమాణం ఉండే గాబియన్ లను అడ్డుకట్టగా వేశారు. బాస్కెట్‌లను ముందుగా ఒకదానిపై ఒకటి పెట్టి వాటిల్లో రాళ్లను నింపి మూడవ గండికి అడ్డుకట్టగా 90 మీటర్లు ఉన్న మూడో గండిలో 40 మీటర్ల వెడల్పు గండిని శుక్రవారం నాడే పూడ్చి వేశారు. ఇక శనివారం సాయంత్రానికి గండి మొత్తం పూడ్చడంతో విజయవాడలో బుడమేరు వరద తగ్గింది. ఇళ్లలో చేరిన బురదను ప్రజలు పరిశుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఫైర్ సిబ్బంది కూడా శుభ్రం చేస్తున్నారు. పారి శుద్ధ్య, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం నుంచి ఇంటింటికీ వాహనాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తు న్నారు.
మూడవ గండిని పూడ్చడంలో ‘గేబియన్ బాస్కెట్’ కీలకం...
బుడమేరు మూడవ గండి పూడ్చివేతలో వాడిన గేబియన్ బాస్కెట్స్ ఎంతో కీలకంగా వ్యవహరించాయి. గేబియన్ బాస్కెట్ అనేది వైర్ మెష్... లేదా ఇతర పదార్థాలతో తయారు చేసిన ఒక కంటైనర్ లాంటిది. దీనిని నిర్మాణం చేసిన ఇంజనీరింగ్ సిబ్బంది ల్యాండ్ స్కేపింగ్‌లో ఉపయోగిస్తారు. స్థిరమైన నిర్మాణంతో అవరోధాన్ని నిర్మూలించడానికి ఇది సాధారణంగా రాళ్ళు, మట్టి లేదా ఇతర పదార్థాలతో నిండి ఉంటుంది.
గేబియన్ బాస్కెట్ వల్ల ఉపయోగాలు
1. కోత నియంత్రణ: వాలు కట్టలు లేదా నదీ తీరాల్లో నేల కోతను నిరోధించడం.
2. నిలుపుదల గోడలు: మట్టి లేదా ఇతర పదార్థాలను నిలువరించడానికి అలంకరణ లేదా క్రియాత్మక గోడలను సృష్టించడం.
3. వరద నియంత్రణ: నీటిని ప్రవాహాన్ని అనుకున్న ప్రదేశానికి మళ్లించడం ద్వారా వరద ముంపు ప్రాంతాలను రక్షించడం.
4. ల్యాండ్ స్కేపింగ్: సరిహద్దులు దాటి ఎవ్వరూ ముందుకు రాకుండా ఈ గేబియన్ ను ఉపయోగిస్తారు.
‘గేబియన్’ అనే పదం ఇటాలియన్ పదం. ‘గబ్బియోన్’ నుండి వచ్చింది, దీని అర్థం పెద్ద పంజరం. గేబియన్ బుట్టలు బల మైన, సౌకర్యవంతమైన నిర్మాణాన్ని తయారు చేయడానికి ఏదో ఒక పదార్థంతో నింపిన వైర్ బోనులు.