ఎవరి కోసం ఉమ్మడి రాజధాని!
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు కొనసాగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నది ఎవరికోసం. ఎందుకోసం, దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌కు సరైన రాజధాని లేదు. చంద్రబాబునాయుడు 2016లో నిర్మించిన తాత్కాలిక భవనాల్లోనే ఏపీ రాజధాని కొనసాగుతోంది. సెక్రటేరియట్ కోసం ఐదు బ్లాకులుగా తాత్కాలిక భవనాలు నిర్మించారు. అవే భవనాల్లో నేటికీ పాలన సాగుతోంది. పేరుకు సెక్రటేరియ్ మాత్రమే కాని గడిచిన ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ జరిగనప్పుడు, ఆ తరువాత ఎప్పుడన్నా మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు వెళ్లారు తప్ప మిగిలిన సమయాల్లో తాడేపల్లిలోని ఇంటి వద్ద నుంచే పాలన సాగించారు.
వగదెగని ఉమ్మడి ఆస్తులు పంపకం
కొన్ని ఉమ్మడి ప్రభుత్వ భవనాలు, స్థిర, చరాస్తులు, బ్యాంకుల్లో నగదు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఆస్తుల్లో వాటాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 2లక్షల కోట్లకు పైన ఉంటుందని అంచనా. దాని ప్రకారం విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ. 1.25లక్షల కోట్ల ఆస్తులు వచ్చే అవకాశం ఉందని పరిశీలకుల మాట. విభజన చట్టం ప్రకారం ఈ ఆస్తుల్లో వాటాలు తీసుకోవాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు 2016లో హైదరాబాద్‌ను వదిలి విజయవాడ వచ్చారు. మొదట ఇవిజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయం నుంచే పాలన సాగించారు. ఆ తరువాత ఆ కార్యాలయాన్ని గవర్నర్ కోసం రాజ్ భవన్‌గా మార్చారు. మిగిలిన కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దెల రూపంలో సంవత్సరానికి రూ. కోటి వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది.
పదేళ్లుగా పరిష్కరించుకోవడంలో విఫలం
విభజన జరిగి పదేళ్లు కావచ్చింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటాను తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. పిడికిలి బిగించి పరిష్కరించుకోవాల్సిన పని చేయలదు. అసెంబ్లీ, సెక్రటేరియట్ మీరే తీసుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం జగన్ అప్పగించారు. దాంతో దానిపై ఉన్న ఆశలు కూడా పోయాయి. మంజీరా గెస్ట్‌హౌస్ ఉంది. ఏపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా హైదరాబాద్ వెళితే అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. అయితే అది సాధారణ గెస్ట్‌హౌస్ కావడం వల్ల ఈ నాయకులెవ్వరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అక్కడ ఉండటం కూడా అయ్యేపని కాదని తేలిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లిన నాయకులు స్టార్ హోటళ్లలో ఉంటున్నారు.
విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది. వీరి రక్షణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం అప్పట్లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గవర్నర్ నతృత్వంలో ఉంటుంది. ప్రాంతీయ తత్వం కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపించడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చసిన కొన్ని వ్యాఖ్యలు కొందరిని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ వాసులకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదనేది స్పష్టమైంది.
మరో పది సంవత్సరాలు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం వల్ల వచ్చే లాభమేమీ లేదనేది స్పష్టమైంది. ఏపీకి రావాల్సిన వాటల సంగతి తేలిస్తే సరిపోతుంది. ఒక వేళ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉండాలని భావిస్తే పార్లమెంట్ జరిగే సమయంలో ఏపీ పాలకులు, మేధావులు ఏమి చేశారు. ఎందుకు అప్పుడు మాట్లాలేదు. ఏపీలో అసెంబ్లీ జరిగేటప్పుడు బిల్లు పెట్టి ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించి ఉంటే అక్కడ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింప జేసుకుంటే ఆ అవకాశం ఉండేది. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లదని చెప్పొచ్చు.
కేంద్ర నిధులే శరణ్యం
ఏపీలో రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తేనే అడుగులు ముందుకు వేస్తారు తప్ప లేకుంటే ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో కట్టే అవకాశమే లదనేది స్పష్టమైంది. ఎందుకంటే ఏపీ కోసం రాజధాని నిర్మాణం పేరులో అమరావతిలో ఇప్పటికే వేల కోట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మట్టిపాలు చేశారు. నిర్మించిన భవనాల్లో కొన్ని శిధిలావస్థకు చరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారా మాత్రమే పరిమినెంట్ సెక్రటేరియట్ నిర్మించే అవకాశం ఉంది. ఇందు కోసం అన్ని పార్టీలు ఏకమై కేంద్రంపై వత్తిడి తెచ్చి నిధుల సమీకరణ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్నారు. ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో 70 శాతం మందికి హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి. నివాస భవనాలు కూడా ఉన్నాయి. వీరంతా ఓన్ చేసుకుని మాట్లాడుతున్నారా? అంటే లేదని చెప్పాలి. అలాంటప్పుడు ఉమ్మడి రాజధాని ఉంటే ఎంత? లేకుంటే ఎంత? వాతన కూడా తెరపైకి వచ్చింది. కార్యాచరణ లేకుండా ఏదీ సాధ్యం కాదనేది ఇప్పటికైన పాలకులు గుర్తిస్తే మంచిదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం నిధులు ఇవ్వాలి: టి లక్ష్మినారాయణ , ప్రముఖ సామాజిక విశ్లేషకులు.
ఏపీలో కొత్తగా రాజధాని నిర్మాణం జరగాలి. అందుకు కేంద్రం నిధులు ఇవ్వాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని కోరటంలో అర్థం లేదు. ఉన్నా ఉపయోగం ఏమిటో పాలకులే చెప్పాలి. షెడ్యూల్ 9,10లో విభజన చట్టం ప్రకారం ఉన్న నిబంధనల మేరకు ఏపీకి రావాల్సిన ఆస్తుల పంపకాలు పూర్తి చేసుకోవాలి. దానిని కూడా అటు చంద్రబాబు, ఇటు జగన్ తెలంగాణకు అప్పగించారు. ఆ డబ్బులు కూడా ఏపీకి రాకుండా పోవడానికి ఇద్దరూ కారకులే. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ను మీరు తీసుకోవచ్చని రాసిచ్చినందునే కేసీఆర్ మరో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించుకోగలిగారు. చిత్తశుద్ధి లేకుండా పైకి మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు.
Next Story