హర్యానా, కశ్మీర్‌లలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్
x

హర్యానా, కశ్మీర్‌లలో తారుమారైన ఎగ్జిట్ పోల్స్

హర్యానాలో అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్‌కే స్పష్టమైన మెజారిటీ వస్తాయని పేర్కొన్నాయి. పరిస్థితి చూస్తే, బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 46(లీడింగ్) దాటింది.


హర్యానా, కశ్మీర్‌లలో కౌంటింగ్ కొనసాగుతోంది. 11 గం.కు అందుతున్న సమాచారాన్నిబట్టి చూస్తే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్నీ తారుమారయినట్లు కనబడుతోంది.

హర్యానాలో అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్‌కే స్పష్టమైన మెజారిటీ వస్తాయని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే, బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 46(లీడింగ్) దాటి ముందుకు దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రస్తుతం 36 స్థానాలలో లీడింగ్‌లో ఉంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపీందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా మాత్రం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు కశ్మీర్‌లో చూస్తే, అక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చు అన్నట్లుగా అనేక సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే, నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రస్తుతం 47 స్థానాలలో లీడింగ్‌లో ఉంది. మరోవైపు బీజేపీ 24 స్థానాలలో, పీడీపీ 5 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.

Read More
Next Story