ఢిల్లీ కాదు.. ఇంద్రప్రస్థ ?
x

ఢిల్లీ కాదు.. ఇంద్రప్రస్థ ?

పాతికేళ్లకుపైగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ.. చరిత్రలో గుర్తుంచిపోయేలా ఏం చేయబోతోంది? దేశ రాజధాని ఢిల్లీ పేరు ఇంద్రప్రస్థగా మారుస్తారా?


మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ నేపథ్యంలో..RSS అనుబంధ సంస్థ VHP ఢిల్లీ పేరును మార్చేందుకు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. మొఘలులకు ముందు పాలించిన హిందూ రాజుల చారిత్రక ఆనవాళ్లను గుర్తించి, అధ్యయనం చేయడానికి ఢిల్లీ(Delhi)లోని చారిత్రక కట్టడాలను పరిశీలిస్తోంది. అందులో భాగంగానే హుమాయున్ సమాధి వద్ద సర్వే చేస్తున్నామని విశ్వ హిందూ పరిషత్(VHP) జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ ది ఫెడరల్‌తో అన్నారు. ‘‘ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలకు మహాభారతంలో జరిగిన ఘటనలతో సంబంధం ఉంది. కాబట్టి ఢిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'(Indraprastha)గా మార్చాలి. రెండు దశాబ్దాలకు పైగా మా నేతలు ఇదే విషయాన్ని చెబుతున్నారు. అశోక్ సింఘాల్ కూడా ఢిల్లీ పేరు మార్పు మార్చాలని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు,’’ అని పేర్కొన్నారు.

నాగ్‌పూర్‌కు చెందిన రచయిత, ఆర్‌ఎస్‌ఎస్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ మాట్లాడుతూ.. ఇది నాగరికతతో ముడిపడి ఉన్న వ్యవహారం. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు ఇలాంటివి కొనసాగుతాయి..’’ అంటూ అయోధ్యలో రామమందిర నిర్మాణం వెనక వీహెచ్‌పీ కృషిని గుర్తుచేశారు.

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. VHP కొత్త డిమాండ్ తెరమీదుకు తెచ్చింది. సంఘ్ పరివార్ సంస్థ ఇప్పుడు

ఢిల్లీలోని హుమాయున్ మరియు సఫ్దర్‌జంగ్ సమాధులపై చాలా మొఘల్ చిహ్నాలు ఉన్నాయి. కానీ ఢిల్లీని పాలించిన హిందూ రాజులకు సంబంధించిన చిహ్నాలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకునేందుకు అన్వేషణ మొదలుపెట్టాం, " అని బన్సాల్ చెప్పారు.

ఢిల్లీలోని పర్యటక ప్రదేశాల్లో హుమాయున్ సమాధి ఒకటి. 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. హిందూ దేవాలయాలను కూల్చేసి కుతుబ్ మినార్ నిర్మించారని VHP చెబుతోంది. రాజస్థాన్‌లోని పవిత్రమైన అజ్మీర్ దర్గాను కూడా ఒక ఆలయంపై నిర్మించారని, ఆలయ అవశేషాలను కనుగొనడానికి దర్గా ప్రాంగణాన్ని అధ్యయనం చేయాలని VHP చాలా కాలంగా పట్టుబడుతోంది.

Read More
Next Story