దావోస్ డిప్లొమసీ ఫలిస్తుందా?
x
దావోస్ చర్చల్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్

దావోస్ డిప్లొమసీ ఫలిస్తుందా?

చంద్రబాబు గత పర్యటనలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆచరణలోకి వచ్చాయా? 2026లో విదేశీ దిగ్గజాలతో కొత్త ఒప్పందాలు ఏమిటి?


దావోస్ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే వేదికలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుస్తున్నారా? 2025 దావోస్ సమావేశాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు 2026 జనవరిలో నాలుగు రోజుల పర్యటనలో దావోస్ లో ప్రకటించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చినప్పటికీ, ఈసారి పర్యటనలో విదేశీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు మరిన్ని ఉద్యోగాలు, ఆధునిక సాంకేతికతలు తెచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే సీఎం విజన్‌లో క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతం, ప్రస్తుతం మధ్య తేడాలు, విదేశీ-దేశీయ సంస్థల పాత్ర, అమరావతి ఆకర్షణలపై విశ్లేషణాత్మకంగా చూద్దాం...

2025 దావోస్ సమావేశాల ద్వారా పెట్టుబడులు ఎన్ని ఆచరణలోకి వచ్చాయి?

2025లో దావోస్‌కు వెళ్లిన చంద్రబాబు నాయుడు టాటా గ్రూప్ అధినేత ఎన్ చంద్రశేఖరన్‌తో సహా పలు గ్లోబల్ సీఈఓలతో చర్చలు జరిపారు. ఫలితంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఇవి పూర్తిగా ఆచరణలోకి వచ్చినట్టు సీఎం ఈసారి దావోస్ లో వెల్లడించారు. మొదటి 10 నెలల్లోనే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని నారా లోకేష్ పేర్కొన్నారు. అయితే కొన్ని నివేదికలు ఆ ఒప్పందాలు పూర్తిగా మెటీరియలైజ్ కాలేదని విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా 91 ప్రధాన సంస్థలు రూ.91,839 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. ఇవి 1.4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయి. గతంలో జగన్ హయాంలో దావోస్ ఒప్పందాలు (రూ.1.20 లక్షల కోట్లు) ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు విజన్‌తో పోలిస్తే గత ఒప్పందాలు 100 శాతం మెటీరియలైజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఆచరణలో ఎన్ని అనేది స్పష్టత లేదు. ఇది రాజకీయ వివాదాస్పదమైన అంశం.


పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు

ఈ ఏడాది దావోస్ కొత్తదేమిటి? ఇండియా వాళ్లతోనే మాట్లాడాడా?

ఈసారి దావోస్‌ పర్యటనలో సీఎం చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవి కేవలం ఇండియా సంస్థలతోనే కాదు, విదేశీ దిగ్గజాలతో కూడా. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ ప్రభుత్వ ప్రతినిధులతో ఇంటర్-గవర్నమెంటల్ మీటింగ్స్ జరిగాయి. విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. మెర్స్క్ (డెన్మార్క్), సిస్కో (యూఎస్), ఎల్‌జీ కెమ్ (కొరియా), కార్ల్స్‌బర్గ్ (డెన్మార్క్), ఆర్సెలర్ మిట్టల్ (లక్సెంబర్గ్). యూఏఈ నుంచి 40 సంస్థలు లాజిస్టిక్స్, పోర్ట్ హ్యాండ్లింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం కుదిరింది. ఆర్సెలర్ మిట్టల్ రూ.60,000 కోట్ల స్టీల్ ప్లాంట్ (అనకాపల్లి). ఆర్‌ఎంజెడ్ గ్రూప్ (ఇండియన్) $10 బిలియన్ డిజిటల్, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా. టాటా గ్రూప్ స్పోర్ట్స్ సిటీలో ఆసక్తి. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో చర్చలు.

కొత్తగా...

గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్, ఫుడ్ క్లస్టర్ (యూఏఈతో). రూ.50 కోట్ల కార్పస్ ఫండ్ నాన్-రెసిడెంట్ తెలుగు వ్యాపారవేత్తలకు. రాష్ట్రం 25 శాతం ఎఫ్‌డీఐ ఆకర్షించింది. ఇది గతంతో పోలిస్తే విదేశీ ఫోకస్ ఎక్కువ. ఇండియన్ సంస్థలతో పాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు ముందుకు వచ్చాయి.


పెట్టుబడి దారులను ఆకర్షిస్తున్న అంశాలు

అమరావతిని ‘ప్రపంచంలోనే అత్యుత్తమ నగరం’గా మార్చాలనే చంద్రబాబు విజన్ పెట్టుబడి దారులను ముందుకు తెస్తోంది. క్వాంటమ్ వ్యాలీ (సిలికాన్ వ్యాలీ తరహాలో) ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది క్వాంటమ్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్‌గా మారుతుంది. జూలై 2026 నాటికి సౌత్ ఏషియాలో అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ (ఐబీఎం, టీసీఎస్‌తో) ఇక్కడ స్థాపన. ఏఐ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీలు (టాటాతో), టూరిజం అభివృద్ధి వంటివి ఆకర్షణలు. అమరావతి స్మార్ట్ ఇన్‌ఫ్రా, గ్రీన్ ప్లానింగ్, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ విజన్‌తో ఆకర్షిస్తోంది. రాష్ట్రం 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పై ఫోకస్ చేయడం, పాలసీ స్టెబిలిటీ, రియల్-టైమ్ గవర్నెన్స్ వంటివి పెట్టుబడి దారులకు భరోసా ఇస్తున్నాయి. గత ఐదేళ్లలో ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి వేగం పుంజుకోవడం, చైనా+1 స్ట్రాటజీలో ఆంధ్రా ముందంజలో ఉండటం కీలకం. అయితే ఆర్థిక సవాళ్లు, రాజకీయ అస్థిరతలు (తెలంగాణతో పోటీ) ఇంకా ఎదుర్కోవాలి. మొత్తంగా చంద్రబాబు డావోస్ పర్యటనలు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మార్చుతున్నాయి. కానీ ఆచరణలో ఫలితాలు చూడాల్సిందే.

Read More
Next Story