పవార్ కోటకు బీటలు - ఠాక్రే సోదరులకు ఎదురుదెబ్బ
x

పవార్ కోటకు బీటలు - ఠాక్రే సోదరులకు ఎదురుదెబ్బ

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన మహాయుతి కూటమి..


Click the Play button to hear this message in audio format

227 స్థానాలున్న బృహన్‌ ముంబయి(Maharashtra) కార్పొరేషన్ (బీఎంసీ)ను చేజిక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 114 ను మహాయుతి కూటమి క్రాస్ చేసింది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా.. షిండే నేతృత్వంలోని శివసేన 27 చోట్ల గెలుపొందింది. ఉద్ధవ్‌ ఠాక్రే(Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 64 స్థానాలను కైవసం చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు విడివిడిగా ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ సేన) ఈ ఎన్నికలకు ముందే జట్టుకట్టినా మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ(BJP), ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి మొత్తం 227 సీట్లలో 118 స్థానాలను గెలుచుకోవడం ద్వారా BMC ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీని సాధించింది.

శరద్‌ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ(ఎస్పీ), అజిత్‌ పవార్‌ చెందిన ఎన్‌సీపీ(ఏపీ) పుణె, పింప్రి-చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని పోటీ చేసినా ఆ రెండు చోట్లా కాషాయ పార్టీ రెపరెపలాడింది.


ఫలితం చూపని రీయూనియన్ ..

ముంబైలో శివసేన (UBT)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. సాంప్రదాయ ఆధిపత్యానికి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. మరాఠాల ఓట్లను సంఘటితం చేయడంతో పాటు బాల్ థాకరే వారసత్వాన్ని కొనసాగించాలన్న లక్ష్యంతో తన సోదరుడు రాజ్ థాకరేతో ఉద్ధవ్ థాకరే పొత్తు పెట్టుకోవాలని ఈ ఎన్నికలలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయినా ఫలితం దక్కలేదు. రాజ్ థాకరే గతంలో ఉత్తర భారతీయులు, ముస్లింలపై చేసిన దుష్ప్రచారాల కారణంగా ప్రతికూల ఫలితాలు రావడానికి కారణంగా భావిస్తున్నారు. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న డిమాండ్ తెరమీదకు తెచ్చిన రాజ్ థాకరే వ్యాఖ్యలు ఉద్ధవ్ పార్టీకి మద్దతును బలహీనపరిచాయి.

మరోవైపు బీజేపీ మరాఠీయేతర ఓట్లను కూడగట్టడంతో విజయం సాధించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మద్దతుతో మరాఠీ ఓటర్లను కూడా కాషాయ పార్టీ తమవైపు తిప్పుకోగలిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభివృద్ధి ప్రదాత, హిందూత్వ ప్రతినిధిగా ప్రచారం చేసుకోవడంతో మరాఠీ ఓటర్ల మద్దతు పొందగలిగారు. ఫలితంగా బీజేపీ-శివసేన కూటమి థాకరే సోదరులను కోలుకోలేనంతగా దెబ్బతీశారు.


పవార్ వారసత్వానికి పెద్ద దెబ్బ..

పూణే, పింప్రి-చించ్‌వాడ్..ఈ రెండు మున్సిపాలిటీలు పవార్ కుటుంబం చేతుల్లో ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. శరద్ పవార్ అజిత్ పవార్ నేతృత్వంలోని రెండు (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు) పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీచేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. వారసత్వంగా నడిచే స్థానిక నాయకత్వం కంటే పాలన, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం చూపే మహాయుతి కూటమికి ఓటర్లు పట్టం కట్టారు. శరద్ పవార్ ప్రచారంలో దాదాపు లేకపోవడం, అతని కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులే పాత్ర పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణం.

Read More
Next Story