బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేస్‌లో ముగ్గురు..
x

మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్

బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేస్‌లో ముగ్గురు..

భారతీయ జనతా పార్టీ చీఫ్‌గా ఒబీసీ నాయకుడి ఎంపిక పార్టీని మరింత బలోపేతం చేస్తుందా?


2024 లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల్లో బీజేపీ అంచనాలను అందుకోలేకపోయింది. అధికారంలోకి రావడానికి భాగస్వాములపై ఆధారపడాల్సి వచ్చింది. పార్టీ నాయకత్వంలో సమతుల్యత కొరవడిందని భావించిన పార్టీ అగ్రనేతలు.. ఓబీసీ నేతను ఎంపిక చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఆ జాబితాలో ఉన్న వారు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్.

ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan):కేంద్ర విద్యా, నైపుణ్య అభివృద్ధి మంత్రి అయిన ప్రధాన్‌కు ఆర్ఎస్ఎస్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. రాజకీయ అనుభవం, ఓబీసీ నేపథ్యం ఈయనకు అదనంగా కలిసొచ్చే అంశాలు.

భూపేందర్ యాదవ్ (Bhupender Yadav): కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి అయిన యాదవ్ బీజేపీ కార్యాచరణలో కీలక పాత్ర పోషించారు. న్యాయవాద వృత్తి నేపథ్యం, పార్టీ నిర్వహణలో నైపుణ్యం ఈయనకు అదనపు బలం.

మనోహర్ లాల్ ఖట్టర్ (ML Khattar): హరియాణా ముఖ్యమంత్రిగా 2014 నుంచి ఉన్న ఖట్టర్.. పాలనా అనుభవంతో పాటు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి.

ఒబీసీ (OBC)అభ్యర్థి వైపే మొగ్గు..

ఈసారి ఓబీసీ వర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించడం ద్వారా..ఆ వర్గానికి బలమైన సంకేతం పంపించాలన్న బీజేపీ యోచన. తమ ఓటు బ్యాంకును మరింత విస్తరించేందుకు, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

పరిస్థితుల దృష్ట్యా కీలక నిర్ణయం..

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) ఏకపక్ష మెజారిటీని సాధించలేకపోవడం, ఎన్డీయే భాగస్వాములపై ఆధారపడాల్సి రావడం లాంటి అంశాల కారణంగా.. పార్టీ నాయకత్వంలో సమతుల్యత అవసరమని పార్టీ అగ్రనేతలు గ్రహించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఒబీసీ నాయకుడి ఎంపిక పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట.

Read More
Next Story